Samsung One UI 8 update : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. One UI 8 అప్‌డేట్ వస్తోంది.. సపోర్టు చేసే ఫోన్ మోడల్స్ ఇవే..!
Samsung One UI 8 update : ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8 జూలై 2025 నాటికి రావచ్చు. గెలాక్సీ S25 సిరీస్ కోసం బీటా టెస్టింగ్ కూడా ప్రారంభమైంది.

Samsung One UI 8 update
Samsung One UI 8 update : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ బిగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ One UI 8 రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కొత్త అప్‌డేట్ జూలై 2025 నాటికి గెలాక్సీ ఫోన్లకు అందుబాటులో ఉండనుంది.
సాధారణంగా, గూగుల్ ఆండ్రాయిడ్ ఫైనల్ వెర్షన్ రిలీజ్ తర్వాత అక్టోబర్, నవంబర్ మధ్య శాంసంగ్ వన్ యూఐ అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తుంటుంది. కానీ, వన్ యూఐ 8తో శాంసంగ్ ముందుగానే రిలీజ్ చేయనుంది. జూలై 2025లో గెలాక్సీ Z ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7లతో పాటు వన్ యూఐ 8 స్టేబుల్ వెర్షన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ అయిన వన్ యూఐ 7 అప్‌డేట్ కన్నా ముందుగానే వస్తుంది.
శాంసంగ్ మే 28, 2025న వన్ యూఐ 8ని టెస్టింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం గెలాక్సీ S25, S25+, S25 అల్ట్రాలకు బీటా వెర్షన్.. జర్మనీ, దక్షిణ కొరియా, యూఎస్, యూకే వంటి ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.
శాంసంగ్ ఫ్యాన్స్ శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా బీటా కోసం సైన్ అప్ చేసుకోవచ్చు. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. శాంసంగ్ ఇప్పటికే రెండో బీటాపై టెస్టింగ్ చేస్తుందని, త్వరలో మరిన్ని గెలాక్సీ మోడళ్లకు టెస్టింగ్ విస్తరించాలని భావిస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.
వన్ యూఐ 8 అప్‌డేట్.. సపోర్టు చేసే మోడల్స్ ఇవే :
శాంసంగ్ ఇంకా అధికారిక జాబితాను రిలీజ్ చేయలేదు. ఈ కొత్త అప్‌డేట్ వైడ్ రేంజ్ ఫోన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
గెలాక్సీ S సిరీస్ : S25 లైనప్, S24 సిరీస్, S23, S22 సిరీస్, S24 FE, S23 FE
గెలాక్సీ Z సిరీస్ : Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 (వన్ UI 8), Z ఫోల్డ్ 6, Z ఫ్లిప్ 6, Z ఫోల్డ్ 5, Z ఫ్లిప్ 5, Z ఫోల్డ్ 4, Z ఫ్లిప్ 4
గెలాక్సీ ట్యాబ్ సిరీస్ : ట్యాబ్ S10+, ట్యాబ్ S10 అల్ట్రా, ట్యాబ్ S9 సిరీస్, ట్యాబ్ S8 సిరీస్
గెలాక్సీ A సిరీస్ : గెలాక్సీ A55, A35, 4 ఏళ్ల సపోర్టుతో ఇతర మిడ్ రేంజ్ ఫోన్‌లు
గెలాక్సీ S21 వంటి పాత ఫోన్‌లకు అప్‌డేట్ రాకపోవచ్చు.
One UI 8 ఫీచర్లు :
- వన్ యూఐ 8 కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులతో వస్తుంది.
- WQHD రిజల్యూషన్‌తో శాంసంగ్ DeX
- టైమ్-ఆధారిత డైనమిక్ వాల్‌పేపర్స్
- మల్టీ టాస్కింగ్ కోసం స్ప్లిట్-స్క్రీన్
- శాంసంగ్ ఇంటర్నెట్ రీడిజైన్, అప్‌డేట్ రిమైండర్ యాప్
- ఆరాకాస్ట్ ఆడియో షేరింగ్ కోసం క్విక్ షేరింగ్, సపోర్టు
- స్మార్టర్ ఏఐ సజెషన్స్