2020లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ లాంచ్ అయి హిట్ కొట్టేసిన కార్లు

కరోనా మహమ్మారి కారణంగా విలవిలలాడుతున్న 2020లాంటి విపత్కర సమయంలోనూ లాంచ్ అయి హిట్ కొట్టేశాయి కొన్ని కార్లు. ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో సూపర్ హిట్ అయిన కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1.Hyundai Creta: హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎస్‌యూవీ క్రెటా సెకండ్ జనరేషన్‌ను మార్చి 16న లాంచ్ చేసింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన కార్లలో టాప్‌లో నిలిచింది ఇదే. లాక్‌డౌన్, అనిశ్చితిలతో ప్రమేయం లేకుండా ఎస్‌యూవీకి పెద్ద ఎత్తులో బుకింగ్స్ వచ్చాయి. 2020 అక్టోబర్ నాటికి 1.15లక్షల బుకింగ్స్ జరిగాయి. ఇండియాలో బెస్ట్ అమ్మకాలు జరుగుతున్న ఎస్యూవీ ఇదే. ఈ దక్షిణకొరియా కార్ మేకర్ 2020 ఏప్రిల్-నవంబర్ మధ్యలో 72వేల 91యూనిట్లు అమ్మకాలు జరిపింది.

 

2.Mahindra Thar: మహీంద్రా & మహీంద్రా ఎస్యూవీ సెగ్మెంట్ లో టఫ్ కాంపిటీషన్ ను తట్టుకుంటూ 2020 ఆగష్టు 15న మహీంద్రా థార్ లాంచ్ చేసింది. ఈ కొత్త స్టైలింగ్, కొత్త డిజైన్ తో 20వేల బుక్సింగ్ కు రెడీ అయింది. ఇవి డెలివరీ అవ్వాలంటే మరో 9నెలల వరకూ వెయిటింగ్ లో ఉండాల్సిందే. డీజిల్, పెట్రోల్ రెండు వర్షన్లలో దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్. మొదటి మహీంద్రా థార్ మోడల్ ను రూ.1.11కోట్లకు ఆన్ లైన్ వేలంలో అమ్ముడైంది. అంటే ఎమ్ అండ్ ఎమ్ మొత్తం 2వేల 568యూనిట్లు అమ్మారని రికార్డుులు చెబుతున్నాయి.

3. Kia Sonet: ఇండియన్ మార్కెట్‌లో SUV హాటెస్ట్ అమ్మకాలు జరుపుతుంది. అరడజనుకు పైగా ఎస్‌యూవీలు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. కేవలం రూ.6.71లక్షల స్టార్టింగ్ ధరతో కాంపిటీటివ్ ఎస్‌యూవీగా నిలిచింది. లాంచింగ్ తొలి దశలోనే దాదాపు 50వేల కస్టమర్లను సంపాదించుకుంది ఈ మోడల్. 2020 నవంబర్ నాటికి 32వేల 404యూనిట్లు అమ్మగలిగారు.

4. Nissan Magnite: ఇండియన్ కార్ మార్కెట్ లో సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న మోడల్.. దీని స్టార్టింగ్ ధర రూ.4.99లక్షలుగా ఉండగా.. 17రోజుల్లోనే దాదాపు 15వేల వరకూ బుకింగ్స్ జరిగాయి.

5. Tata Altroz: జనవరి 2020లో లాంచ్ అయిన టాటా మోటార్స్ ప్రొడక్ట్ టాటా ఆల్ట్రోజ్. మారుతీ సుజుకీ బలెనో, హ్యూండాయ్ ఐ20లను కొనుగోలు చేయాలనుకునేవారు ఈ మోడల్ పై కన్నేస్తున్నారంటే దాని లుక్ అంత బాగుంది. నెక్సాన్, టియాగో తర్వాత బెస్ట్ సెల్లింగ్ కార్ ఏదైనా ఉందంటే.. అది ఆల్ట్రోజ్ మాత్రమే. టాటా మోటర్స్ అమ్మకాల్లో 25శాతం ఈ మోడల్‌దే.

6. New Honda City: హోండా కార్స్ ఐదో జనరేషన్ మిడ్-సైజ్ సెడాన్ ను లాంచ్ చేసింది. డిమాండ్ తక్కువగా ఉంటనే నెలకు 3వేల 500నుంచి 4వేల యూనిట్ల వరకూ అమ్ముడుపోతున్నాయి. జపనీస్ కార్ మేకర్ మొత్తం 40శాతం అమ్మకాలు జరుపుతుంది. ఏప్రిల్ – నవంబర్ మధ్య నెలల్లో 15వేల 333యూనిట్లు అమ్మింది హోండా.

7. Hyundai i20: ఎస్యూవీ క్రెటా.. దక్షిణకొరియా కార్ మేకర్ హ్యుండాయ్ మోటార్ ఐ20 న్యూ వర్షన్ ను లాంచ్ చేసింది. మూడు ఇంజన్ల ఆప్షన్‌తో ఈ మోడల్ ను మార్కెట్లోకి తెచ్చారు. లాంచ్ చేసిన 40రోజుల్లోనే హ్యూండాయ్ ఐ20 30వేల బుకింగ్స్ సంపాదించింది. లాక్‌డౌన్ పీరియడ్‌లోనే 20వేల యూనిట్లు అమ్మేశారు.

8. Tata Nexon EV: ఎలక్ట్రిక్ వెహికల్ నెక్సాన్ తొలి వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది టాటా మోటార్స్ ప్రొడక్ట్ టాటా నెక్సాన్ ఈవీ. ఇండియాలోని ఎలక్ట్రిక్ కార్స్‌లో ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సమయంలో 2వేల 959యూనిట్లు అమ్మారు. ఇండియాలో జరిగిన 70శాతం ఎలక్ట్రిక్ కార్ అమ్మకాల్లో టాటా నెక్సాన్ ఈవీకి చెందినవే.

ట్రెండింగ్ వార్తలు