×
Ad

Top Smartwatches Sale : పండగ సేల్ ఆఫర్లు.. ధంతేరాస్, దీపావళికి కొనాల్సిన టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ఏది కొంటారో మీ ఇష్టం!

Top Smartwatches Sale : దీపావళి పండగ సీజన్‌లో అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్‌లు లభ్యమవుతున్నాయి. ఫిట్‌నెస్, ఫ్యాషన్ కోసం టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను ఓసారి లుక్కేయండి.

1/6
Top Smartwatches Sale : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? దీపావళి, ధంతేరాస్ పండుగ సందర్భంగా అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది హెల్త్, ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, స్టైలీష్ గాడ్జెట్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే స్మార్ట్‌వాచ్‌లు అదిరిపోయే డిజైన్‌లు, కచ్చితమైన హెల్త్ మానిటరింగ్, హై-ఎండ్ ఏఐ ఫీచర్లు కలిగి ఉన్నాయి. మీరు కూడా ఈ పండగ సీజన్‌లో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ధంతేరాస్, దీపావళి ఆఫర్లలో ఫిట్‌నెస్, ఫ్యాషన్ పరంగా 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌వాచ్ ఏ బ్రాండ్ మోడల్ కావాలో కొనేసుకోవచ్చు.
2/6
ఆపిల్ వాచ్ సిరీస్ 10 : ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 10 అత్యంత హాటెస్ట్ స్మార్ట్‌వాచ్. S10 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. గత మోడల్స్‌తో పోలిస్తే ప్రతి ఫంక్షన్‌లో 30శాతం స్పీడ్ ఉంటుంది. ఆల్వేస్-ఆన్ రెటినా డిస్‌ప్లేతో పగటిపూట కూడా చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్, బాడీ టెంపరేచర్ ట్రాకింగ్, స్లీప్ యానాలిసిస్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఇప్పుడు ఏఐ ఆధారిత నోటిఫికేషన్‌లు, ఫిట్‌నెస్ సజెషన్స్ WatchOS 11కి అప్‌గ్రేడ్ అయింది. స్టయిల్, టెక్నాలజీ, హెల్త్ ట్రాకింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది.
3/6
శాంసంగ్ గెలాక్సీ 7 : కొత్త శాంసంగ్ స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఎక్సినోస్ W940 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌వాచ్ పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ వాచ్‌లోని కొన్ని ఫంక్షన్లలో బ్లడ్ ప్రెజర్-సంబంధిత మానిటరింగ్, బాడీ కంపోజిషన్ అనలైజర్, ఏఐ-ఎంపవర్డ్ వర్కౌట్ ట్రాకింగ్ ఉన్నాయి. ఫ్రింట్స్ క్లాసిక్, స్పోర్ట్స్ మోడల్‌లలో అందుబాటలో ఉన్నాయి. ప్రత్యేకించి ఫిట్‌నెస్, ఫ్యాషన్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
4/6
ఫిట్‌బిట్ వెర్సా 5 : హెల్త్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్కోరు, స్లీప్ స్కోరు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఛార్జ్ విషయానికి వస్తే.. రీఛార్జ్ చేయకుండా దాదాపు 6 రోజులు వర్క్ అవుతుంది. ప్రతిరోజూ ఛార్జర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. గూగుల్ ఫిట్, మ్యాప్స్‌తో సహా యాప్ కనెక్టవిటీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
5/6
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 : 2025 నాయిస్ బడ్జెట్ కేటగిరీలో అద్భుతమైన ఆప్షన్. 2025 నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 అదిరిపోయే ఫీచర్లు కలిగి ఉంది. అమోల్డ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్-రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్ ఉన్నాయి. అంతేకాదు.. సరసమైన ధరలో క్లాసీగా కనిపించే స్మార్ట్‌వాచ్ కోరుకునేవారి సరిగ్గా సెట్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 7 రోజులు వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇంటర్‌ఫేస్ ఆకర్షణీయంగా ఉంటుంది.
6/6
వన్‌ప్లస్ వాచ్ 2 ప్రో : వన్‌ప్లస్ వాచ్ 2 ప్రో అనేది డ్యూయల్-ఇంజన్ ఆర్కిటెక్చర్‌తో హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్. అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. టైటానియంతో రూపొందింది. ఈ స్మార్ట్‌వాచ్‌ చూసేందుకు క్లాసీగా ఉంటుంది. ఈ ఫీచర్ ఏఐ ఫిట్‌నెస్ సిఫార్సులను కలిగి ఉంది. స్ట్రెస్, ఆక్సిజన్ లెవల్స్ ట్రాక్ చేయగలదు. వన్‌ప్లస్ వాచ్ 2ప్రో ఫిట్‌నెస్ ప్రియులకు అద్భుతమైన ఆప్షన్. 100 కన్నా ఎక్కువ వర్కౌట్ మోడ్‌లను కలిగి ఉంది.