2020లో రాబోయే WhatsaApp Top ఫీచర్లు ఇవే?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు 300 మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఈ చాట్ యాప్ నుంచి ప్రతి యూజర్ ఎన్నో మెసేజ్‌లు షేర్ చేస్తుంటారు. యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేసేందుకు వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ రిలీజ్ చేస్తుంటుంది. ఇదివరకే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫేస్‌బుక్ సొంత యాప్.. 2020లో మరిన్ని టాప్ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్లపై ఎప్పటినుంచో వాట్సాప్ వర్క్ చేస్తోంది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ టాప్ ఫీచర్లను కొత్త ఏడాదిలో వరుసగా రిలీజ్ చేయనుంది. వాట్సాప్ ఒక్కో ఫీచర్‌ను ముందుగా Beta modeలో ప్రవేశపెట్టి టెస్టింగ్ చేస్తుంది. ఆ తర్వాతే Stable వెర్షన్‌లో ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇదివరకే Beta Version Appలో అందుబాటులోకి వచ్చేసాయి కూడా. అతికొద్ది రోజుల్లో 2019 ముగియబోతోంది. కొత్త ఏడాది 2020 రాబోతోంది. ఈ కొత్త ఏడాదిలో వాట్సాప్ అందించబోయే టాప్ ఫీచర్లు ఏంటో? ఓసారి లుక్కేద్దాం…
1. Dark mode (డార్క్ మోడ్) :
ఎప్పటినుంచో వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది. ముందుగా iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. బీటా వెర్షన్ రిలీజ్ అయ్యే ఈ ఫీచర్ లో కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ కనిపించవు. WaBetaInfo ప్రకారం.. డార్క్ మోడ్ ఫీచర్ రెడీగా ఉంది. కానీ, Status Updates cell, Profile వంటి అప్ డేట్స్ వంటి ఎలిమెంట్స్ కనిపించవు.
సెట్టింగ్స్ కింద కనిపించే.. కాంటాక్ట్, స్టోరేజీ లిస్ట్ సెల్స్, Backup సెక్షన్ అప్ డేట్స్ కనిపించవు. ఇక ఫోన్ నెంబర్‌తో పాటు About, Contact Infoలోని సెక్షన్‌లో బిజినెస్ వివరాలు సైతం Inactive మోడ్ లో ఉంటాయి. 2020 నుంచి Stable Version Whatsappలో ఈ Updates అన్ని iOS, Android యూజర్లకు కనిపించే అవకాశం ఉంది.
2. WhatsApp for iPad:
వాట్సాప్ ఫర్ ఐప్యాడ్.. Desktopపై మాత్రమే కాదు.. ఆండ్రాయిడ్, ఐఫోన్లపై కూడా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి iPadపై ఈ యాప్ సపోర్ట్ చేయడం లేదు. చాట్ యాప్ ఐప్యాడ్ పై పనిచేయదు. ఐప్యాడ్ లో ప్లే స్టోర్ నుంచి Whatsapp డౌన్ లోడ్ చేస్తే.. iPhone version యాప్ మాత్రమే అందుబాటులో ఉంది.
WaBetaInfo ప్రకారం.. ఐప్యాడ్ యూజర్లకు ఈ ప్రాబ్లమ్ త్వరలో రిజాల్వ్ కానుంది. ఐప్యాడ్ సపోర్ట్ కోసం ఫీచర్‌పై వాట్సాప్ వర్క్ చేస్తోంది. అతి త్వరలో ఈ ఫీచర్ లాంచ్ కానుంది. 2020నాటికి ఐప్యాడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. Main App మాదిరిగానే ఐప్యాడ్ వెర్షన్ యాప్ కూడా ఒకే రకమైన ఫీచర్లు కలిగి ఉంటుంది. కానీ, iPadలో UI compatibility తో పనిచేస్తుంది.
3. Blocked contact notice :
వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రానుంది. అదే.. బ్లాక్‌డ్ కాంటాక్ట్ నోటీసు.. అంటే.. మీ వాట్సాప్ కాంటాక్టులో ఎవరిదైనా వాట్సాప్ కాంటాక్టును చాట్ బాక్సులో మీరు Block చేసి ఉంటే.. Unblock చేస్తారా? అంటూ ఓ నోటిఫికేషన్ బార్ Pop-up కనిపిస్తుంది.
వాట్సాప్ Chat boxలో కాంటాక్ట్ ఓపెన్ చేసినా ప్రతిసారి బ్లాక్ చేసిన దానికి సంబంధించి bubble కనిపిస్తుంది. మీరు ఆ కాంటాక్టును Unblock చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. 2020లో ఈ Blocked Contact నోటీసు ఫీచర్ అమల్లోకి రానుంది.
4. Delete messages :
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అదే.. డిలీట్ మెసేజ్ ఫీచర్.. అంటే.. ఓ నిర్దిష్టమైన సమయానికి ఆటోమాటిక్ గా Chat Box నుంచి మెసేజ్ డిలీట్ అయిపోతోంది. ఈ ఫీచర్..Private Chat, Group Chat రెండింటిలోనూ సపోర్ట్ చేస్తుంది. ఎన్నిరోజులు, ఎన్ని నెలలకు చాట్ బాక్సు నుంచి Message Delete మెసేజ్ డిలీట్ చేయాలో కచ్చితమైన సమయాన్ని సెట్ చేస్తే చాలు.. దాని అంతట అదే మెసేజ్ Auto Delete చేసేస్తుంది. ఈ ఫీచర్ కూడా 2020లోనే అందుబాటులోకి రానుంది.