సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ “ట్రాయ్” (TRAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు నిజమైనవో, నకిలీవో తెలుసుకునేందుకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
ఫోన్‌కు వచ్చే ప్రతి మెసేజ్ వెనుక పీ, ఎస్, టీ, జీ అక్షరాలను వాడుతోంది. దీంతో ఆ మెసేజ్ ఏ కేటగిరీకి చెందినదన్న వివరాలను గుర్తించవచ్చు. పీ అంటే ప్రమోషనల్, ఎస్ అంటే సర్వీస్, టీ అంటే ట్రాన్సాక్షనల్, జీ అంటే గవర్నమెంట్ అని అర్థం.
Also Read: పూరీ జగన్నాథ రథయాత్ర.. 500 మందికిపైగా భక్తులకు గాయాలు?
సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు, లింకులు పంపుతూ చాలా మందిని మోసాలకు గురి చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆ మెసేజ్‌లను నమ్మితే మన బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే. ఫోన్‌లకు వచ్చే లింకులపై క్లిక్ చేయకూడదని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తెలియని నంబరు నుంచి వచ్చే మెసేజులను నమ్మకూడదు.