Twitter Blue Tick Bug : ట్విట్టర్ కొంపముంచిన బగ్.. లెగసీ అకౌంట్లకు బ్లూ టిక్ తొలగిస్తే.. ఫ్రీగా తిరిగి ఇచ్చేసింది..!

Twitter Blue Tick bug : ఇటీవలే ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ తొలగించింది. ఎవరైతే బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ కోసం చెల్లిస్తారో వారికి మాత్రమే బ్లూ టిక్ ఎనేబుల్ చేస్తుంది. ట్విట్టర్ బ్లూ టిక్ బగ్ ఇష్యూతో చాలామంది యూజర్లకు మళ్లీ ఉచితంగా బ్లూ టిక్ తిరిగి వచ్చేసింది.

Twitter Blue Tick Bug : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) ఇటీవలే బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చింది. బ్లూ టిక్ పొందాలంటే తప్పకుండా బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సిందే.. లేదంటే వారి అకౌంట్లలో బ్లూ టిక్ తొలగిస్తుంది ట్విట్టర్ ప్లాట్‌ఫారం.. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత లెగసీ ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ తొలగించింది. కేవలం బ్లూ టిక్ కోసం పేమెంట్ చేసిన యూజర్లకు మాత్రమే వెరిఫైడ్ బ్యాడ్జ్ అందిస్తోంది. ట్విట్టర్ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం ద్వారా బ్లూ టిక్ వెరిఫికేషన్‌ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తింది.

ట్విట్టర్ బగ్ కారణంగా లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే మళ్లీ వెరిఫై అయ్యాయి. గత నెల చివరిలో ట్విట్టర్ (Twitter Blue Subscrpition) బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేని ప్రొఫైల్‌ల నుంచి లెగసీ బ్లూ టిక్‌లను తొలగించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్‌తో సహా కొంతమంది సెలబ్రిటీల బ్లూ టిక్ అకౌంట్లలో కూడా స్టేటస్ తొలగించింది. ఫాలోవర్లు తక్కువగా ఉన్న ట్విట్టర్ యూజర్లు నెలకు రూ. 900 చెల్లించడం ద్వారా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మిలియన్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన ఇతరులు బ్లూ టిక్‌ను ఉచితంగా పొందవచ్చు.

బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే మళ్లీ వెరిఫై చేయొచ్చు :
ఈ ప్రక్రియ చాలా సులభం.. ఎంచుకున్న ప్రొఫైల్‌లలో మాత్రమే వర్క్ అవుతుంది. మీ ప్రొఫైల్‌లో లెగసీ బ్లూ టిక్ ఉన్నట్లయితే.. మళ్లీ వెరిఫైడ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ప్రొఫైల్ బయోని ‘పాత బ్లూ చెక్’తో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీ బయోలో ‘లెగసీ బ్లూ చెక్’ని కూడా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత బ్లూ టిక్ వెంటనే కనిపిస్తుంది. ఈ పద్ధతి ట్విట్టర్ యాప్, ట్విట్టర్ వెబ్ రెండింటిలోనూ పని చేస్తుంది.

Read Also : Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!

మీరు ప్రొఫైల్‌ను రిఫ్రెష్ చేసిన తర్వాత లేదా ట్విట్టర్ యాప్‌ను ఫోర్స్-షట్ చేసిన తర్వాత.. బ్లూ టిక్ వెంటనే అదృశ్యమవుతుంది. అంతేకాదు.. మీరు మాత్రమే బ్లూ టిక్‌ని చూడగలరు. ఇతర ట్విట్టర్ యూజర్లు మాత్రం చూడలేరు. దీనికి కారణం అస్పష్టంగానే ఉంది. కానీ, ఎందుకు ఇలా కనిపిస్తుందంటే.. ట్విట్టర్ ప్లాట్‌ఫారంలో టెక్నికల్ బగ్‌గా కారణంగా ఇలా కనిపిస్తుంది. ట్విట్టర్ ఈ బగ్‌ని త్వరలోపరిష్కరించే అవకాశం కూడా ఉంది.

Twitter bug allows legacy verified users to get back their Blue Tick for free

మీరు ఈ ట్రిక్ ప్రయత్నించే సమయానికి ట్విట్టర్ బ్లూ టిక్ అకౌంట్లో కనిపించకపోవచ్చు. ఆసక్తికరంగా, ఈ పద్ధతి ద్వారా పొందిన ట్విట్టర్ బ్లూ టిక్ పాత టెక్స్ట్‌ మాత్రమే కనిపిస్తుంది. అంటే.. మీరు బ్యాడ్జ్‌పై క్లిక్ చేసిన తర్వాత ‘ఈ అకౌంట్ ప్రభుత్వం, వార్తలు, వినోదం లేదా మరో కేటగిరీలో ఐడెంటిటీని కలిగి ఉంది కనుక వెరిఫై చేయడం జరిగింది” అని టెక్స్ట్ కనిపిస్తుంది. మీరు ప్రొఫైల్‌లో మీ పాత బ్లూ టిక్‌ను కోల్పోయినట్లయితే.. నెలవారీ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడం ద్వారా మాత్రమే పొందవచ్చు.

మీ ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్ ద్వారా సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే.. నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ట్విట్టర్ వెబ్ ద్వారా సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే.. నెలకు ధర రూ. 650 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే.. ట్విట్టర్ బ్లూ టిక్ ఉచితంగా పొందవచ్చు. కానీ, అలా వచ్చిన బ్లూ టిక్ ఎప్పటికీ అలానే ఉండకపోవచ్చు. ట్విట్టర్ కొత్త మార్పులు చేస్తే.. మళ్లీ బ్లూ టిక్ కోల్పోయే అవకాశం ఉంది.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియాలో రూ.549 ప్లాన్ రద్దు.. ఈ సరికొత్త ప్లాన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు