Telugu » Technology » Twitter Invites Applications For Verification Of Accounts How To Apply For A Blue Tick
Twitter Blue Tick : ట్విట్టర్ అకౌంట్ల వెరిఫికేషన్.. బ్లూ టిక్ మార్క్ కోసం అప్లయ్ చేసుకోండిలా..
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్ అకౌంట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టింది. మూడేళ్ల తర్వాత ట్విట్టర్.. ప్రముఖుల అకౌంట్లపై బ్లూ టిక్ చెక్ మార్క్ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తోంది. 2017లోనే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ ప్రాసెస్ నిలిపివేసింది.
Twitter Invites Applications For Verification Of Accounts. How To Apply For A Blue Tick
Twitter accounts blue tick verification : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్ అకౌంట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టింది. మూడేళ్ల తర్వాత ట్విట్టర్.. ప్రముఖుల అకౌంట్లపై బ్లూ టిక్ చెక్ మార్క్ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తోంది. 2017లోనే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ ప్రాసెస్ నిలిపివేసింది. బ్లూ టిక్ మార్క్ విధానం ఏకపక్షంగా ఉందని, యూజర్లలో గందరగోళానికి దారితీయడంతో ట్విట్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
దాంతో మైక్రోబ్లాగింగ్ సైట్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రముఖ యూజర్ల ట్విట్టర్ అకౌంట్లను రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెడుతోంది. రాబోయే కొద్దివారాల్లో ఈ ప్రాసెస్ ప్రారంభించనున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది. ట్విట్టర్ 199 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లలో 360,000 అకౌంట్లు మాత్రమే వెరిఫై అయ్యాయి.
ట్విట్టర్ బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేయాలంటే? :
కొన్ని కేటగిరీ యూజర్లకు మాత్రమే..
ప్రభుత్వం, కంపెనీలు, బ్రాండ్లు, సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, ఎంటర్మైనెంట్, క్రీడలు, గేమింగ్, యాక్టివిస్టులు, ఆర్గనైజర్లతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ చేసుకునే వీలుంది.
ట్విట్టర్ 2021 చివరి నాటికి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రిలిజియన్ లీడర్ వంటి కేటగిరీలకు కూడా బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ విధానం అందుబాటులోకి తీసుకురానుంది.
గత ఏడాదిలో అకౌంట్ లాక్ అయి ఉండరాదు..
మీ అకౌంట్ గత ఆరు నెలల్లో యాక్టివ్‌గా ఉండాలి.
అకౌంట్లలో ట్విట్టర్ నిబంధనలను ఫాలో అయినట్టు రికార్డు ఉండాలి.
గత ఏడాదిలో 12 గంటల లేదా ఒక వారం పాటు అకౌంట్ లాక్ అయి ఉండరాదు.. అంటే ఎలాంటి ట్విట్టర్ ఉల్లంఘనలు లేకుండా ఉండాలి.
మీ అకౌంట్లు ప్రొఫైల్ ఇమేజ్ వంటి ఫీచర్లు ప్రభుత్వ ఐడి లేదా ఇమెయిల్ అడ్రస్ ద్వారా యూజర్ ఐడింటిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి అయి ఉండాలి.
మీ అకౌంట్ నుంచి ఇలా దరఖాస్తు చేయండి :
అర్హతగల ట్విట్టర్ యూజర్లందరూ రాబోయే కొద్ది వారాల్లో ‘Account Settings’ ట్యాబ్‌లో న్యూ వెరిపికేషన్ యాప్ చూడొచ్చు.
ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీ అధికారిక ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయడం లేదా మీ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధం ఉన్న అధికారిక వెబ్‌సైట్ లింక్‌ను ఇవ్వొచ్చు.
అప్లికేషన్ ఆమోదిస్తే.. ట్విట్టర్ మీ ప్రొఫైల్‌లో బ్లూ బ్యాడ్జ్ ఎనేబుల్ అవుతుంది. బ్యాడ్జ్ రిక్వెస్ట్ తిరస్కరిస్తే.. 30 రోజుల తర్వాత మీరు మళ్లీ అప్లయ్ చేసుకోవచ్చు.
బ్లూ చెక్ మార్క్ వెరిఫై కోసం పంపిన అప్లికేషన్లు అన్ని మ్యానివల్ వెరిఫికేషన్ (టెక్నికల్ టీమ్) ప్రకారమే రివ్యూ చేస్తుంది ట్విట్టర్.