Threads First Update : మెటా ‘థ్రెడ్స్‘ ఫస్ట్ మేజర్ అప్‌డేట్ ఇదిగో.. ఇక యూజర్లకు పండగే.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త ఫీచర్లు..!

Threads New Update : ఆపిల్ ఐఫోన్లలో థ్రెడ్స్ యాప్ (Threads Update) గ్లోబల్ లాంచ్ అయిన దాదాపు 2 వారాల తర్వాత ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రిలీజ్ చేస్తోంది. ఈ యాప్ ఇప్పటికే ట్విట్టర్‌లో అందుబాటులో ఉన్న అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Threads First Update : ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా (Meta) ఐఫోన్‌లలో థ్రెడ్స్ (Threads) యాప్‌ కోసం సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోంది. థ్రెడ్స్ డెవలపర్ కామెరాన్ రోత్ ప్రకారం.. ఈ యాప్ థ్రెడ్స్ యూజర్ల నుంచి పోస్ట్‌లను చూపే యాక్టివిటీ ఫీడ్‌లో ట్రాన్స్‌లేషన్స్ డెడికేటెడ్ ఫాలోస్ ట్యాబ్ వంటి కొత్త ఫీచర్‌లను అందించనుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ ద్వారా వినియోగదారులు ఇతరుల పోస్ట్‌లను ఫాలో చేయకుండానే సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

ఇందులో కొన్ని బగ్ ఇష్యూలు కూడా ఉన్నాయి. కొంతమంది యూజర్లు రెండు వారాల క్రితమే థ్రెడ్స్ ప్రారంభ వెర్షన్‌తో బగ్స్ సమస్యలను ఎదుర్కొన్నారు. థ్రెడ్స్ (Instagram) టెక్స్ట్-ఆధారిత ఎక్స్‌‌టెన్షన్ అయినప్పటికీ (Twitter) డైరెక్ట్ పోటీదారు కావడంతో.. మెటా అందించిన కొత్త యాప్‌లో (Instagram), Twitter రెండూ అందించే DM (డైరెక్ట్ మెసేజ్‌లు) వంటి కొన్ని పాపులర్ ఫీచర్లు ఇప్పటికీ అందుబాటులో లేవు.

Read Also : Realme C53 Launch : 108MP ప్రైమరీ కెమెరాతో రియల్‌మి C53 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫస్ట్ సేల్ ఎప్పుడో తెలుసా?

కొత్త అప్‌డేట్‌లు ఐఫోన్ల కోసమే అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా ఈ కొత్త ఫీచర్లను త్వరలో అందుకోనుంది. థ్రెడ్స్ డెస్క్‌టాప్ వెర్షన్ ఇప్పటికీ అందుబాటులో లేదు. iOS యాప్‌కి సంబంధించిన అప్‌డేట్ భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. అయితే, థ్రెడ్స్ యూజర్లు వెంటనే చూడకపోవచ్చు. థ్రెడ్‌లలోని పోస్ట్‌లో ఫీచర్‌లను చూసేందుకు యూజర్లు యాప్‌ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుందని రోత్ పేర్కొన్నాడు.

ఈ ఫీచర్‌లు కనిపించడానికి ఫుల్ డే కూడా పట్టవచ్చు. సర్వర్ డెలివరీ చేసిన ఫ్లాగ్ సిస్టమ్ అందించనుంది. పూర్తి స్థాయిలో రిలీజ్ చేసేందుకు కొంత సమయం పడుతుందని రోత్ స్పష్టం చేశాడు. ఐఫోన్లలో యాప్‌ను అప్‌డేట్ చేసినప్పటికీ ఫీచర్‌ను గుర్తించలేకపోయారు. ఈ పోస్ట్ దిగువన లైక్, రిప్లై, రీపోస్ట్, షేర్ ఆప్షన్‌లతో పాటు ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కనిపిస్తుందని రోత్ పేర్కొన్నాడు.

Threads First Update : Twitter rival Threads receives first major update two weeks after launch, Meta adds many new features

థెడ్స్ ఫస్ట్ మేజర్ అప్‌డేట్ ట్విట్టర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్‌లను అందిస్తుంది. మెటా కొత్త యాప్ ట్విట్టర్ కాపీ క్యాట్‌గా ఆరోపించింది. అయితే మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని సంస్థ ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఇది ఫ్రెండ్లీ ప్లాట్‌ఫారమ్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరణ ఇచ్చింది. థ్రెడ్స్ యూజర్లను నిలుపుకోవడానికి త్వరలో మరిన్ని ఫీచర్‌లను యాడ్ చేసే ఆలోచనలో ఉందని తెలిపింది. యాప్ ఇప్పటికే యూజర్‌బేస్‌లో వృద్ధిని సాధిస్తోంది. కానీ, వాటిని నిలుపుకోవడం ఎల్లప్పుడూ సవాలుగా మారుతోంది.

ఎలన్ మస్క్ కూడా ట్విటర్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో మస్క్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఏవైనా లోపాలు ఉండవచ్చు. థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి మాజీ ట్విట్టర్ ఉద్యోగులను ఉపయోగించుకున్నందుకు మెటాపై దావా వేస్తామని ట్విట్టర్ హెచ్చరించింది. ట్విట్టర్ కూడా ఇటీవల ఎంపిక చేసిన వినియోగదారులను డబ్బు సంపాదించడానికి యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ థ్రెడ్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read Also : OnePlus 12 Specifications Leak : భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు