Apple : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమేనట!

ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్విట్టర్ కొత్త (New Button) ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో ట్విట్టర్ ఇతర యూజర్ల ప్రొఫైల్ ట్వీట్లను సెర్చ్ చేయొచ్చు.

New Profile-Specific Search Icon : ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ట్విట్టర్ కొత్త (New Button) ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో ట్విట్టర్ ఇతర యూజర్ల ప్రొఫైల్ ట్వీట్లను సెర్చ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్.. వ్యక్తిగత ప్రొఫైల్ పేజీలను సెర్చ్ చేసేందుకు రూపొందించింది. నిర్దిష్ట అకౌంట్ల ట్వీట్‌ల కోసం మాత్రమే సెర్చ్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది. ఈ కొత్త బటన్ సెర్చ్ పీచర్ iOS లేటెస్ట్ వెర్షన్‌లో గుర్తించారు. అధికారికంగా ఏదైనా ఫీచర్లను ప్రవేశపెట్టానికి ముందు ట్విట్టర్ వాటిని టెస్టింగ్ చేస్తుంది. రెగ్యులర్ ట్విట్టర్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి ముందే ట్విట్టర్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏయే ఫేచర్లరు రాబోతున్నాయి అప్ కమింగ్ అంటూ అందరి కన్నా బీటా యూజర్లకు కనిపించేలా కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది.

పేమెంట్ Twitter బ్లూటిక్ సర్వీసు కొత్త ల్యాబ్స్ బ్యానర్‌ (new Labs banner)లో కొన్ని కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సస్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి ట్విట్టర్ యూజర్ పేరు వారి ప్రొఫైల్ పేజీలో Twitter కొత్త సెర్చ్ బటన్‌ ఉందని XDA డెవలపర్లు ముందుగా గుర్తించారు. ఈ కొత్త శోధన @Username ట్వీట్ల బటన్ iOSలో కొంతమంది వినియోగదారులకు కనిపించింది. ప్రస్తుతం ఈ New Button ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండవచ్చు. షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం.. కొత్త బటన్ మూడు డాట్ల మెనూ పక్కన టాప్ రైట్ కార్నర్ లో ఉంటుంది. iOS యూజర్లు వారి సొంత ట్వీట్లు లేదా ఇతర అకౌంట్ల ట్వీట్లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

Search Buttonపై క్లిక్ చేయడం ద్వారా, యూజర్లకు కావలసిన పదాన్ని ఎంటర్ చేయొచ్చు. మీరు ఎంటర్ క్లిక్ చేసినప్పుడు, సెర్చ్ ఫంక్షనాలిటీకి సమానమైన స్క్రీన్ కనిపిస్తుంది. కానీ సెర్చ్ చేసిన పదం దీని ఫార్మాట్‌కు మారుతుంది. ప్రొఫైల్‌లలోని ఈ కొత్త సెర్చ్ బటన్ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నా అధునాతన సెర్చ్ ఫీచర్‌కు ఇది బెస్ట్ ఫీచర్ గా చెప్పుకొవచ్చు. ప్రస్తుతం.. Twitter ప్రొఫైల్‌ కొత్త సెర్చ్ బటన్ ఫీచర్ మా iOS యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫంక్షనాలిటీ ఇంకా Android యూజర్లకు అందుబాటులోకి రాలేదు.

సెర్చ్ బటన్ ఏదైనా ప్రొఫైల్ టాప్ రైట్ కార్నర్ లో గుర్తించవచ్చు. ఇక్కడ మీరు (User Term) మాదిరిగా మీ యూజర్ నేమ్ టైప్ చేయవచ్చు. కొత్త ల్యాబ్స్ బ్యానర్‌లో కొన్ని కొత్త ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్‌ను పొందడానికి ఖాతాదారులకు అనుమితిస్తున్నామని Twiiter ఒక ప్రకటనలో వెల్లడించింది. పేమెంట్ సర్వీసుల్లో ఒకటైన Twitter బ్లూ టిక్ మార్క పొందవచ్చని Twitter గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. Twitter ప్రోగ్రామ్‌లోని ఫీచర్ల సాయంతో iOSలో కానర్వేజేషన్ చేసిన మెసేజలను యూజర్లు చూడొచ్చు.
Read Also : iPhone 13: దీపావళి స్పెషల్ ఆఫర్.. ఐఫోన్‌ 13పై భారీ తగ్గింపు!

ట్రెండింగ్ వార్తలు