Ultraviolette unveils F99 electric motorcycle, calls it India's first-ever superbike
Ultraviolette F99 electric motorcycle : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లోకి సరికొత్త సూపర్ బైక్ వచ్చేసింది. అదే.. అల్ట్రావయోలెట్ F99 ఎలక్ట్రిక్ సూపర్‌బైక్. భారత్‌లో ఆవిష్కరించిన ఫస్ట్ సూపర్‌బైక్ అని కంపెనీ పేర్కొంది.
అంతేకాదు, రాబోయే 90 రోజులలో F99 భారతీయ మోటార్‌సైకిల్ ద్వారా అత్యధిక వేగవంతమైన వేగంతో రికార్డును నెలకొల్పనుంది. భారతీయ మోటార్‌సైకిల్‌కు అత్యంత వేగవంతమైన క్వార్టర్-మైలు రికార్డును కూడా క్లెయిమ్ చేస్తుందని అల్ట్రావయోలెట్ పేర్కొంది. F99 సూపర్ బైక్ బెంగళూరులోని కంపెనీ ఆర్ అండ్ డి హబ్‌లో డిజైన్, ఇంజనీరింగ్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది.
గరిష్ట వేగం గంటకు 265కి.మీ రేంజ్ :
అల్ట్రావయోలెట్ F99 సూపర్ బైక్ 90kW లిక్విడ్-కూల్డ్ మోటారు ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. ఈ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 265 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.
ఈ F99 బైక్ స్కేల్ 178కిలోల వద్ద ఉంటుంది. డిజైన్ వారీగా F99 చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సూపర్సోనిక్ జెట్‌ల మాదిరిగా డిజైన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. వింగ్‌లెట్స్, ఎయిర్ డక్ట్‌లు, అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ వంటి ఫీచర్ల F99 బైకులో ఉన్నాయి.
2025లోనే సూపర్ బైక్ అందుబాటులోకి :
ప్రస్తుతం, అల్ట్రావయోలెట్ F77 మాచ్ బ్రాండ్ ‘స్పేస్ స్టేషన్స్’ నెట్‌వర్క్ ద్వారా 5 నగరాల్లో అందుబాటులో ఉంది. అందులో హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, పూణె, బెంగళూరులో ఇప్పటివరకు ఈ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, విశాఖపట్నం, మంగళూరు నగరాల్లో వచ్చే నెలలో సొంత అల్ట్రావయోలెట్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ F99 ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ 2025లో భారత మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.