UPI Payments Alert : హ్యాకర్లతో జాగ్రత్త.. గూగుల్ పే, ఫోన్‌పేలో ఇప్పుడే లాక్ పెట్టుకోండి.. మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు భద్రం..!

UPI Payments Alert : గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe) లేదా (Paytm) వంటి మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..

UPI Payments Alert : హ్యాకర్లతో జాగ్రత్త.. గూగుల్ పే, ఫోన్‌పేలో ఇప్పుడే లాక్ పెట్టుకోండి.. మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు భద్రం..!

UPI Payments Alert

Updated On : September 22, 2024 / 7:27 PM IST

UPI Payments Alert : భారత మార్కెట్లో ఆన్‌లైన్ స్కామ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను మోసగించి డబ్బును తస్కరించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి కాల్ చేసి, అతనిని లేదా ఆమెను తమ మొబైల్‌కి యాక్సెస్ కోసం అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతారు. లేదంటే తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు తద్వారా ఈ మోసగాళ్లు మొబైల్ ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్‌ను పొందిన తర్వాత బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును తమ సొంత అకౌంట్లకు బదిలీ చేస్తుంటారు.

ఇందుకోసం UPI యాప్‌ల వంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను వినియోగించుకుంటున్నారు. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక పోలీసు కూడా తన మొబైల్ ఫోన్‌కు స్కామర్‌లకు రిమోట్ యాక్సెస్‌ను అందించే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తద్వారా దాదాపు రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు.

ఇలాంటి స్కామ్‌లను నిరోధించడానికి, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ఎల్లప్పుడూ మంచిది కాదు. అయినప్పటికీ, సెక్యూరిటీ విషయంలో అనేక సార్లు మోసాలకు గురవుతుంటారు. మీరు కూడా అటువంటి ట్రాప్‌లో చిక్కుకునే అవకాశం ఉంది. స్కామర్‌లకు అనుకోకుండా మీ ఫోన్‌కి రిమోట్ యాక్సెస్ ఇవ్వడంలో ఆందోళన చెందుతున్నారా? స్కామర్‌లు మీ UPI IDని యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి కొన్ని భద్రతపరమైన టిప్స్ పాటించండి.

Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ 16 కొంటున్నారా? ఇలా చేస్తే.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

యూపీఐ యాప్‌లలో బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రారంభించండి :
మీ UPI IDని ప్రొటెక్ట్ చేసేందుకు ఎల్లప్పుడూ టూ-ఫ్యాక్టరీ అథెంటికేషన్ సెటప్ చేయాలి. అయితే, స్కామర్లు OTPలను పొందేందుకు SMS యాప్‌ను కూడా హ్యాక్ చేయవచ్చు. మీరు GPay, PhonePe లేదా Paytm వంటి యాప్‌లను ఓపెన్ చేసేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి.

మీ ఫోన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్ ఉపయోగించడం వల్ల అదనపు ప్రొటెక్షన్ లేయర్ అందిస్తుంది. మీ UPI యాప్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ, మీ ఫేస్ చూపడం ద్వారా లేదా మీ ఫింగర్ ఫ్రింట్ అందించడం ద్వారా మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలి. మీ డివైజ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేస్తున్న స్కామర్‌లు అలాంటి సందర్భాలలో ఈ యాప్‌లను ఓపెన్ చేయలేరు. మీ UPI IDని మరింత సేఫ్‌గా ఉంచుకోవాలి.

గూగుల్ పేలో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :

* గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోను నొక్కండి.
* సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
* ప్రైవసీ & సెక్యూరిటీని Tap చేయండి.
* సెక్యూరిటీని Tap చేయండి.
* స్క్రీన్ లాక్ ఆప్షన్ నొక్కండి.
* మీరు ఇప్పటికే స్క్రీన్ లాక్ సెటప్ చేయలేదా? మీకు ప్రాంప్ట్ కనిపిస్తుంది.
* మీరు స్క్రీన్ లాక్‌ని సెటప్ చేసిన తర్వాత, ఫింగర్‌ఫ్రింట్ ఎనేబుల్ ఆప్షన్ నొక్కండి.
* మీ ఫింగర్ ఫ్రింట్ స్కాన్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో చేయండి.
* మీ ఫింగర్ ఫ్రింట్ స్కాన్ చేసిన తర్వాత Continue బటన్ ట్యాప్ చేయండి.
* బయోమెట్రిక్ లాక్‌ని ఎనేబుల్ చేసేందుకు ON బటన్ నొక్కండి.

PhonePeలో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ON చేయాలంటే? :

* PhonePe యాప్‌ను ఓపెన్ చేయండి.
* స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటో Tap చేయండి.
* ఈ కిందికి స్క్రోల్ చేయండి. సెక్యూరిటీపై Tap చేయండి.
* స్క్రీన్ లాక్‌పై నొక్కండి.
* స్క్రీన్ లాక్‌ని ఎనేబుల్ ఆప్షన్ నొక్కండి.
* మీకు ఇష్టమైన బయోమెట్రిక్ మెథడ్ ఎంచుకోండి.
* Set Up ఆప్షన్ Tap చేయండి.

Paytmలో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :

* Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
* స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్ Tap చేయండి.
* సెక్యూరిటీ ఆప్షన్ Tap చేయండి.
* బయోమెట్రిక్ లాక్‌పై Tap చేయండి.
* Start బటన్ Tap చేయండి.

మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్ చేసేందుకు స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. మీ మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఆన్ చేసిన తర్వాత Paytm యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ అన్‌లాక్ చేసేందుకు మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ అకౌంట్ లావాదేవీలను అనధికార యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో సాయపడుతుంది.

Read Also : iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!