×
Ad

Upcoming Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్లు వస్తున్నాయోచ్.. ఫీచర్లు మాత్రం కెవ్వు కేక.. ఏ ఫోన్ ధర ఎంత ఉండొచ్చంటే? ఫుల్ డిటెయిల్స్..

Upcoming Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్లు రాబోతున్నాయి. 2025లో సరికొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. ధర, ఫీచర్లు, లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

Upcoming Motorola Phones

Upcoming Motorola Phones : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి, 2025లో కొత్త ఫోన్ లైనప్ కోసం మోటోరోలా కంపెనీ రెడీ అవుతోంది. భారతీయ మార్కెట్లోకి సరికొత్త మోటోరోలా ఫోన్లు లాంచ్ చేయనుంది. మీరు కూడా కొత్త మోటోరోలా ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే..

మోటోరోలా సరికొత్త ఫోన్ మోడల్స్ లాంచ్ (Upcoming Motorola Phones) ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చు? ఏయే ఫీచర్లు ఉంటాయి అనేదానిపై కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది. మోటోరోలా రాబోయే ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G :
మోటోరోలా ఎడ్జ్ సిరీస్ స్మార్ట్, స్లిమ్, పవర్-ప్యాక్డ్ ఫోన్‌లను కోరుకునే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. 2025లో రాబోయే ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఈ సిరీస్‌కి చివరి అప్‌డేట్. ప్రీమియం డిజైన్ కొనుగోలుదారులను ఆకర్షించేలా ఉంది. హై రిఫ్రెష్ రేట్‌తో ఓఎల్ఈడీ ప్యానెల్ ఇప్పుడు స్మూత్ స్క్రోలింగ్ గేమింగ్‌తో వస్తుంది. లో-లైటింగ్ ఫొటోగ్రఫీ కెమెరాలో హై క్వాలిటీ ఫొటోతో కొత్త 50MP సెన్సార్‌తో వస్తుంది.

ఈ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ సిరీస్‌లో కొత్త చిప్‌సెట్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ యాడ్-ఆన్ రోజువారీ పర్ఫార్మెన్స్ ఈజీ చేస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ దాదాపు 5000mAh టర్బోచార్జింగ్‌తో వేగంగా ఉంటుంది. ధర వారీగా పరిశీలిస్తే ఈ మోటోరోలా ఫోన్ ధర రూ26వేల నుంచి రూ. 30వేల వరకు ఉండవచ్చు.

మోటోరోలా G75 5G :

భారతీయ మార్కెట్లో మోటోరోలా జీ సిరీస్ నుంచి ఇప్పటికే అత్యంత ఆకర్షణీయమైన మోడల్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మోటో G75 మరో ఫోన్ కూడా రాబోతుంది. కానీ, 2025లో లాంచ్ అవుతుందని అంచనా. ఈ మోటోరోలా ఫోన్ G-సిరీస్‌తో సరికొత్త డిజైన్‌ తీసుకురానుంది.

మీ గేమింగ్, వీడియో సోషల్ మీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మెయిన్ కెమెరా సెటప్ వైడ్ 64MP ఒకటిగా ఉండాలి. పర్ఫార్మెన్స్ పరంగా కొత్త డైమెన్సిటీ-సిరీస్ ప్రాసెసర్ ద్వారా అప్‌గ్రేడ్ అవుతుంది. 5,000mAh బ్యాటరీతో రోజంతా వాడినా ఛార్జింగ్ వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ లాంచ్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుందని అంచనా.

Read Also : Flipkart Black Friday Sale : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏది కొంటారో మీఇష్టం..!

మోటోరోలా ఎడ్జ్ 50 :
మోటోరోలా అందించే అల్ట్రా-ప్రీమియం ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అల్ట్రా-కర్వ్డ్ 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ OIS సపోర్టుతో 200MP సెన్సార్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ప్రొఫెషనల్-గ్రేడ్ స్టాండర్డ్స్ సూచిస్తుంది.

పర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. కొత్త స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ సిరీస్ చిప్‌సెట్‌ పొందవచ్చు. సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీ దాదాపు 4800mAh వరకు ఉండవచ్చు. రెండు నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 48వేల నుంచి రూ. 55వేల మధ్య ఉండవచ్చు.

మోటోరోలా G55 లైట్ :

మోటోరోలా యూజర్ల కోసం బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ మోటోరోలా ఫోన్ G55 లైట్‌లో FHD+ డిస్‌ప్లే, 50MP కెమెరా బ్యాలెన్స్‌డ్ ప్రాసెసర్‌ ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా పరిశీలిస్తే.. పూర్తిగా క్లీన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

మోటోరోలా యాప్‌లు, యాడ్స్ పరంగా తక్కువగా ప్రాయారిటీ ఇస్తుంది. బ్యాటరీ దాదాపు 5000mAh ఉంటుంది. సరిగ్గా వాడితే ఈ ఫోన్ ఛార్జింగ్ ఒకటిన్నర రోజులు ఉంటుంది. ధర విషయానికి వస్తే.. ఈ మోటోరోలా G55 లైట్ ధర రూ. 12వేల నుంచి రూ.14వేల మధ్య ఉండొచ్చు.

మోటోరోలా రేజర్ :
ఫ్లిప్ ఫోన్ ఔత్సాహికుల కోసం మోటోరోలా రెజర్ 2025 లాంచ్ చేయనుంది. కొత్త రెజర్ ఫోన్ హింగ్‌లు, భారీ కవర్ డిస్‌ప్లే, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన కెమెరా, ప్రాసెసర్ కలిగి ఉండొచ్చు.

స్టయిల్, సరికొత్త టెక్నాలజీ పరంగా పరిశీలిస్తే.. ఈ మోటోరోలా రెజర్ ఫోన్ ధర రూ. 70వేల నుంచి రూ. 85వేల మధ్య ఉంటుందని అంచనా. మోటోరోలా నుంచి అనేక కొత్త మోడల్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని ఫోన్లు లుక్స్, పెర్ఫార్మెన్స్ పరంగా యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి.