Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.!

Aadhaar Update : కొత్తగా పెళ్లి అయిందా? అయితే, మీ ఆధార్ కార్డులో పాత వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. మీ పేరుతో పాటు ఇంటి అడ్రస్ వివరాలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.

Update Your Aadhaar Name

Aadhaar Update : రీసెంట్‌గా మీకు మ్యారేజీ అయిందా? మీ ఆధార్ కార్డులో పేరు లేదా అడ్రస్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ చాలా సులభంగా మార్చుకోవచ్చు. వాస్తవానికి, ఆధార్ కార్డు భారతీయ పౌరులకు అత్యంత అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్. అందుకే పెళ్లి తర్వాత తర్వాత ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

Read Also : Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..!

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు లావాదేవీల వరకు అన్నింటికి ఆధార్ కార్డు తప్పనిసరి. మీ ఇంటిపేరు మార్చాలనుకున్నా లేదా ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలన్నా మీరు ముందుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్లయ్ చేయవచ్చు. మీ ఆధార్ వివరాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్‌డేట్ చేసుకునేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.

పెళ్లి తర్వాత ఆధార్‌లో పేరు మార్చుకోవాలంటే? :
పెళ్లి అయిన తర్వాత ఆధార్‌లో మీ పేరును మార్చుకోవచ్చు. మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయాలి. ఆధార్ పేరు మార్పు ఫారమ్‌ను నింపండి. మీ 12-అంకెల ఆధార్ నంబర్, కొత్త పేరును ఎంటర్ చేయండి. మీ మ్యారేజీ సర్టిఫికేట్ కాపీని సమర్పించండి.

ఆ సర్టిఫికెట్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ప్రస్తావిస్తే.. మీరు ‘Aadhaar Card Linking Form’ ఉపయోగించి మీ ఆధార్‌ను వారి ఆధార్‌కు కూడా లింక్ చేయవచ్చు. అయితే, ఆధార్ పేరు మార్పు కోసం రూ. 50 రుసుము చెల్లించాలి.

ఆధార్ పేరును అప్‌డేట్ చేసేందుకు ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే : 

  • మీరు అధికారిక (UIDAI) వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మీ ఆధార్ పేరును ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేయొచ్చు.
  • UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ‘My Aadhaar’ సెక్షన్‌పై క్లిక్ చేయండి :
  • “Update Demographics Data” ఆప్షన్ ఎంచుకోండి.
  • క్యాప్చా కోడ్‌ (Captcha) తో పాటు 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • పేరు అప్‌డేట్ చేసేందుకు “Name” ఆప్షన్ ఎంచుకోండి. మీ కొత్త పేరును ఎంటర్ చేయండి.
  • మీ మ్యారేజీ సర్టిఫికేట్, లైఫ్ పార్టనర్ ఆధార్ కార్డు స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
  • అప్‌డేట్ కోసం రూ. 50 రుసుము చెల్లించండి.
  • ప్రాసెస్ తర్వాత కొత్త అప్‌డేట్ చేసిన వివరాలను మీ ఆధార్‌లో చూడవచ్చు.

ఆధార్‌లో పేరు అప్‌డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇవే : 

  • పెళ్లి తర్వాత ఆధార్‌లో మీ పేరును అప్‌డేట్ చేసేందుకు ఈ కింది డాక్యుమెంట్లు అవసరం.
  • ప్రభుత్వ అధికారి జారీ చేసిన మ్యారేజీ సర్టిఫికేట్
  • భర్త లేదా భార్య ఆధార్ కార్డు కూడా సమర్పించాలి.
  • అప్‌డేట్ చేసిన ఆధార్ లేదా ఏదైనా ఇతర వ్యాలీడ్ డాక్యుమెంట్ కూడా సమర్పించాలి. ప్రస్తుత అడ్రస్ ప్రూఫ్ ఉన్నా చాలు
  • ఫింగర్ ఫ్రింట్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.
  • సమర్పించిన తర్వాత రసీదు స్లిప్‌ను అందుకుంటారు.
  • మీరు అప్‌డేట్ ప్రక్రియను ట్రాక్ చేసేందుకు ఉపయోగించవచ్చు.

మీ పెళ్లి తర్వాత ఆధార్‌లో అడ్రస్ ఎలా మార్చాలంటే? : 

Read Also : Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..!

  • మీరు పెళ్లి తర్వాత కొత్త అడ్రస్ మారితే.. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీ కొత్త అడ్రస్‌తో ఆధార్ కరెక్షన్ ఫారమ్ నింపండి.
  • పవర్ బిల్లు లేదా ప్రభుత్వం ఆమోదించిన అడ్రస్ ప్రూఫ్ వంటి ఇతర డాక్యుమెంట్లను సమర్పించాలి.
  • ఆ తర్వాత, మీరు ట్రాకింగ్ కోసం URN (అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్) అందుకుంటారు.
  • మీ కొత్త అడ్రస్ 90 రోజుల్లోపు అప్‌డేట్ అవుతుంది.
  • పూర్తి వెరిఫికేషన్ కోసం మీ మ్యారేజీ సర్టిఫికేట్, మీ భాగస్వామి ఆధార్ కార్డును కూడా సమర్పించాలి.