iPhone 16 Upgrade : ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేస్తున్నారా? మీ పాత ఐఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!

iPhone 16 Upgrade : మీ పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ ఎట్టకేలకు ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది.

Upgrading to iPhone 16_ Here is what to do before you exchange your old iPhone

iPhone 16 Upgrade : మీరు కొత్త ఐఫోన్ 16 సిరీస్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీ పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ ఎట్టకేలకు ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. లేటెస్ట్ ఐఫోన్లు కొత్త యాక్షన్, కెమెరా కంట్రోల్ బటన్‌లు, ఎ18 చిప్, కెమెరా అప్‌గ్రేడ్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ మరిన్నింటితో సహా అనేక కొత్త అప్‌గ్రేడ్‌లతో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 20 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Read Also : iPhone 16 Sale Offers : కొత్త ఐఫోన్ కావాలా? మరో 2 రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. భారత్‌‌లో ధర ఎంతంటే?

ఆసక్తిగల కొనుగోలుదారులు లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ రూ. 79,900 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. కానీ, డిస్కౌంట్ల గురించి ఏమిటి? సరే, కొత్త ఐఫోన్‌లు ప్రస్తుతం లాంచ్ ధరకే విక్రయించనుంది. అయితే, మీరు పాత జనరేషన్ ఐఫోన్‌ని ఉపయోగిస్తుంటే.. ఐఫోన్16కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే.. కొంత డబ్బు ఆదాతో మీ పాత ఐఫోన్ సులభంగా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

అయితే, మీ పాత ఐఫోన్‌ను ఇతరులకు అప్పగించే ముందు మీ డేటాను బ్యాకప్ చేయడం, పాత ఫోన్‌ను క్లీన్ చేయడం వంటి కొన్ని విషయాలు మీరు తప్పక చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం తొలగించినట్టు నిర్ధారించుకోవాలి. మీ ఫోన్ కొత్త యజమాని కోసం రెడీగా ఉన్నట్టే. ఎక్స్ఛేంజ్ కోసం మీ పాత ఐఫోన్ ఎలా రెడీ చేయాలనే దానిపై దశల వారీగా గైడ్ మీకోసం అందిస్తున్నాం.

బ్యాకప్ తప్పనిసరి :
ముందుగా, మీ డేటాను బ్యాకప్ చేయండి. మీ డేటాను బ్యాకప్ చేస్తే.. మీ కాంటాక్టులు, ఫోటోలు, మెసేజ్‌లు, ఇతర ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉన్నాయని, మీ కొత్త ఫోన్ సులభంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదనంగా, మీ ఐఫోన్ రీసెట్ చేసినా లేదా ట్రేడ్-ఇన్ ప్రాసెస్‌లో సమస్య ఏర్పడినా మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. మీ కొత్త ఐఫోన్ 16లో రీస్టోర్ అవుతుంది. మీ డేటాను ఎక్స్‌ట్రనల్ డివైజ్‌లో సేవ్ చేయవచ్చు లేదా ఐక్లౌడ్ లేదా మీ కంప్యూటర్‌ని ఉపయోగించి మీ ఐఫోన్ బ్యాకప్ చేయవచ్చు.

ఐక్లౌడ్‌తో ఐఫోన్‌లో డేటాను బ్యాకప్ చేయాలంటే? :

  • మీ ఐఫోన్ సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి.
  • టాప్‌లో ఉన్న మీ పేరుపై ట్యాప్ చేయండి.
  • iCloud ఆప్షన్ ఎంచుకోండి.
  • ఐక్లౌడ్ బ్యాకప్ ట్యాప్ చేయండి.
  • స్విచ్ ఆన్ చేయండి. ఆపై ‘Backup Now’ నొక్కండి.
  • ఈ ప్రక్రియ ఐక్లౌడ్‌లో మీ ఐఫోన్ డేటా బ్యాకప్‌ను క్రియేట్ చేస్తుంది.
  • బ్యాకప్ చేసిన తర్వాత మీ కొత్త ఐఫోన్‌లో మీ డేటాను సులభంగా రీస్టోర్ చేయొచ్చు.
  • ఐక్లౌడ్, ఆపిల్ సర్వీసుల నుంచి సైన్ అవుట్ చేయండి.

ఎక్స్ఛేంజ్ చేసే ముందు ఐక్లౌడ్, ఇతర ఆపిల్ సర్వీసుల నుంచి సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేయడంతో మీ వ్యక్తిగత సమాచారం ప్రైవేట్‌గా ఉంటుంది. కొత్త యూజర్ మీ అకౌంట్లను యాక్సెస్ చేయలేరు.

సైన్ అవుట్ చేయడం ఎలా? :

  • సెట్టింగ్‌ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • మీ పేరుపై ట్యాప్ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేసి ‘సైన్ అవుట్’ ట్యాప్ చేయండి.
  • ఫైండ్ మై ఐఫోన్ ఆఫ్ చేయడానికి మీ ఆపిల్ ఐడీ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి ఆపై కన్ఫార్మ్ చేయండి.
  • ఆపిల్ వాచ్ డేటాను బ్యాకప్ చేయండి.
  • అదనంగా, ఆపిల్ వాచ్, ఇయర్‌బడ్‌లతో సహా మీ డివైజ్‌లను అన్‌పెయిర్ చేయండి.
  • మీ వాచ్ డేటాను బ్యాకప్ చేయడంతో మీ కొత్త ఐఫోన్ దాన్ని రీస్టోర్ చేసేందుకు కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీ ఆపిల్ వాచ్‌ను అన్‌పెయిర్ చేయండిలా :

  • మీ ఐఫోన్‌లో వాచ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • టాప్ లెఫ్ట్ కార్నర్‌లో అన్ని గడియారాలను ట్యాప్ చేయండి.
  • మీ వాచ్ పక్కన ఉన్న ఇన్ఫో బటన్ (i)ని నొక్కండి.
  • ఆపిల్ వాచ్ అన్‌పెయిర్‌ని ఎంచుకుని, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  • అలాగే, ‘Find My iPhone’ ఆప్షన్ ఆఫ్ చేయండి
  • ఫైండ్ మై ఐఫోన్ ఆఫ్ చేస్తే మీ ఆపిల్ ఐడీ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంది.
  • మీ ఐఫోన్ మరెవరూ ఉపయోగించకుండా నిరోధిస్తుంది.

ఫైండ్ మై ఐఫోన్‌ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేయాలంటే? :

  • సెట్టింగ్స్‌కు వెళ్లండి.
  • మీ పేరుపై ట్యాప్ చేయండి. ఆపై ‘Find My‘ ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘ఫైండ్ మై ఐఫోన్‌’ ట్యాప్ చేయండి. దానిపై టోగుల్ చేయండి.
  • చివరగా, మీ ఐఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.
  • మీ ఐఫోన్ బ్యాకప్ చేసిన తర్వాత మొత్తం కంటెంట్, సెట్టింగ్‌లను రిమూవ్ చేయొచ్చు.

మీ ఐఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలి? :

  • సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.
  • జనరల్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేయండి. ఐఫోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయండి లేదా రీసెట్ చేయండి.
  • ‘ఆల్ ఎరేజ్ కంటెంట్ రిమూవ్’ అనే సెట్టింగ్‌ ట్యాప్ చేయండి.
    మీ పాస్‌కోడ్, ఆపిల్ ఐడీపాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేయండి.

Read Also : iPhone 16 Price Comparison : ఐఫోన్ 16 కొంటున్నారా? భారత్‌ కన్నా విదేశాల్లోనే ధర చాలా తక్కువ తెలుసా? ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు