iPhone 16 Sale Offers : కొత్త ఐఫోన్ కావాలా? మరో 2 రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. భారత్‌‌లో ధర ఎంతంటే?

Apple iPhone 16 Sale Offers : ఐఫోన్ 16 సిరీస్ కేవలం రెండు రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రీ-ఆర్డర్లతో అందుబాటులో ఉండనుంది.

iPhone 16 Sale Offers : కొత్త ఐఫోన్ కావాలా? మరో 2 రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. భారత్‌‌లో ధర ఎంతంటే?

iPhone 16 pre-order window opens in 2 days

Apple iPhone 16 Sale Offers : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ సందర్భంగా భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ తీసుకొచ్చింది. అయితే, ఐఫోన్ 16 సిరీస్ కేవలం రెండు రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రీ-ఆర్డర్లతో అందుబాటులో ఉండనుంది.

Read Also :  Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..

సెప్టెంబర్ 13న సాయంత్రం 5:30 గంటల నుంచి ఆసక్తిగల కస్టమర్‌లు కొత్త ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ మోడల్‌లను సెప్టెంబర్ 20న అధికారిక విక్రయానికి ముందు రిజర్వ్ చేసుకోగలరు. భారత మార్కెట్లో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు లేటెస్ట్ ఐఫోన్‌ల ధరల గురించి పూర్తివివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధరలు :
ఆపిల్ ఐఫోన్ 16 వివిధ రకాల స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు ధరలలో వస్తుంది. 128జీబీ స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వెర్షన్ ధర రూ.89,900. హై స్టోరేజ్ అవసరమయ్యే యూజర్లకు 512జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900కు పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ మోడల్‌కు రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 99,900, రూ. 1,19,900కు పొందవచ్చు. మీరు ఐఫోన్ 16ప్రో కోసం చూస్తుంటే.. 128జీబీ మోడల్‌కు రూ. 1,19,900 ప్రారంభ ధరతో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. ఈ ఐపోన్ల ధర వరుసగా రూ.1,29,900, రూ.1,49,900, రూ.1,69,900కు అందిస్తుంది.

అత్యంత ప్రీమియం మోడల్ కావాలనుకునే వారికి, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్‌కు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుంది. 512జీబీ వెర్షన్ ధర రూ. 1,64,900 కాగా, టాప్-టైర్ 1టీబీ మోడల్ ధర రూ. 1,84,900కు పొందవచ్చు.

ఐఫోన్ 16 సిరీస్.. భారత్‌లో సేల్ ఆఫర్‌లు :
భారతీయ కొనుగోలుదారులకు ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆపిల్ కొన్ని ముఖ్యమైన లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు తమ ఐఫోన్ కొనుగోలుపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అదనంగా, ఆపిల్ సొంత డివైజ్ స్టేటస్, మోడల్ ఆధారంగా కొనుగోలుదారులకు రూ. 67,500 వరకు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ కోసం ఒక ఆప్షన్ కూడా ఉంది. కొనుగోలుదారులు తమ చెల్లింపులను 3 లేదా 6 నెలల వరకు సెట్ చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 16 : మీ ఫోన్లు మడతపెట్టినప్పుడు చెప్పండి.. ఆపిల్ ఐఫోన్ 16పై శాంసంగ్ వ్యంగ్యాస్త్రాలు..!