UPI Lite New Update : యూపీఐ లైట్ వాడుతున్నారా? ఇకపై మీ బ్యాంకు అకౌంట్ నుంచి వ్యాలెట్‌లోకి నేరుగా డబ్బులు పంపుకోవచ్చు!

UPI Lite New Update : ఇకపై యూపీఐ లైట్ వ్యాలెట్లలోకి మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులను ఎలాంటి ఆమోదం లేకుండానే నేరుగా పంపుకోవచ్చు.

UPI Lite can now add money to wallet ( Image Credit : Google )

UPI Lite New Update : మీరు యూపీఐ లైట్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ లైట్ వ్యాలెట్లలోకి మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులను ఎలాంటి ఆమోదం లేకుండానే నేరుగా పంపుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూజర్ ఎక్స్‌‌పీరియన్స్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : MP Salary Per Month : లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత? అలవెన్సులతో కలిపి నెలకు ఎంత వస్తుందో తెలుసా?

ఇందులో యూపీఐ లైట్ సిస్టమ్ కోసం కొత్త అప్‌డేట్ ప్రకటించింది. లేటెస్ట్ ప్రతిపాదన యూపీఐ లైట్‌ని ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకువస్తుంది. వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి ఎలాంటి అదనపు ఆమోదాలు అవసరం లేకుండానే వారి యూపీఐ లైట్ వ్యాలెట్ల ఆటోమాటిక్‌గా రిప్లేస్ చేసేందుకు అనుమతిస్తుంది.

వ్యాలెట్లలో మాన్యువల్ టాప్ అప్ అవసరం లేదు :
వ్యాలెట్ బ్యాలెన్స్ యూజర్ థ్రెషోల్డ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు యాక్టివేట్ చేసేందుకు ఈ ఆటో-రిప్లెనిష్‌మెంట్ ఫీచర్ రూపొందించింది. బ్యాలెన్స్ తక్కువగా ఉన్న ప్రతిసారీ వినియోగదారులు ఇకపై తమ వ్యాలెట్లను మాన్యువల్‌గా టాప్ అప్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా చిన్నమొత్తంలో డిజిటల్ పేమెంట్స్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఈ మార్పుతో రోజువారీ లావాదేవీలకు యూపీఐ లైట్‌ని ఉపయోగించవచ్చు. సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన యూపీఐ లైట్ ఆన్-డివైస్ వ్యాలెట్ ద్వారా త్వరితంగా చిన్నమొత్తంలో పేమెంట్లను చేసేందుకు అనుమతిస్తుంది.

ఈ పేమెంట్ యూజర్లను సులభంగా లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా రూ. 500 కన్నా తక్కువగా ఉంటుంది. యూపీఐ లైట్ సిస్టమ్ పేమెంట్లను ప్రాసెస్ చేసేందుకు ఎన్‌పీసీఐ కామన్ లైబ్రరీ (CL) అప్లికేషన్‌ను ఉపయోగిస్తుంది. మొబైల్ ఫోన్‌లలో ఇప్పటికే ఉన్న యూపీఐతో ఇంటిగ్రేట్ అవుతుంది. ఈ సిస్టమ్ యూజర్ల కోసం స్థిరమైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది.

రోజువారీ లావాదేవీ పరిమితి రూ.2వేలు మాత్రమే :
ప్రస్తుతానికి, యూపీఐ లైట్ యూజర్లు రూ. 2వేల రోజువారీ లావాదేవీ పరిమితిని అందిస్తోంది. ఏ ఒక్క చెల్లింపుకైనా గరిష్ట పరిమితిని రూ. 500గా నిర్ణయించారు. కిరాణా, రోడ్డురవాణా లేదా చిన్న రిటైల్ కొనుగోళ్లు వంటి రోజువారీ లావాదేవీలను చేసేందుకు ఈ పరిమితులను ఉపయోగిస్తుంది. యూపీఐ లైట్ చిన్న మొత్తంలో లావాదేవీలను నిర్వహించడానికి యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెమిటర్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ల ద్వారా రియల్ టైమ్ ప్రాసెసింగ్ అవసరాన్ని అందిస్తోంది. భద్రతతో ఈ లావాదేవీలు వేగంగా సౌకర్యవంతంగా పూర్తిచేసేలా యూపీఐ లైట్ అనుమతిస్తుంది.

యూపీఐ లైట్ ఇ-మాండేట్‌ను ప్రవేశపెట్టడం అనేది దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లను పెంచడానికి ఆర్బీఐ వ్యూహాత్మక చర్య. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఈ ఫీచర్‌తో సౌకర్యంగా ఉండకపోవచ్చు. ప్రైవసీపరంగా సమస్యలను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఈ ఆప్షన్ బ్యాంకుల నుంచి వ్యాలెట్లకు ఆటోమాటిక్‌గా డబ్బును యాడ్ చేసేందుకుఒకరి ఆమోదం అవసరం లేదు. వినియోగదారులు ఈ ఫీచర్‌ని ఉపయోగించకూడదని భావిస్తే డిసేబుల్ చేసే అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.

Read Also : WWDC 2024 Event : ఈ నెల 10 నుంచి WWDC 2024 ఈవెంట్.. ఆపిల్ అన్ని డివైజ్‌‌ల్లోకి కొత్త పాస్‌వర్డ్ మేనేజర్‌!