UPI New Rules
UPI New Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. యూపీఐ పేమెంట్ల కోసం ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 8 నుంచి యూపీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. యూపీఐ పేమెంట్ల సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సిన పనిలేదు. పిన్ లేకుండానే మీ ఫేస్ స్కాన్, ఫింగర్ ఫ్రింట్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు.
ఒకవేళ యూపీఐ పిన్ మర్చిపోతే (UPI New Rules) ఏటీఎం కార్డు లేకున్నా ఈజీగా పిన్ రీసెట్ చేసుకోవచ్చు. సాధారణంగా యూపీఐ యూజర్లు తరచుగా యూపీఐ పిన్ మర్చిపోతుంటారు. ఆ తర్వాత పిన్ రీసెట్ చేసేందుకు ఏటీఎం కార్డ్ వివరాలు లేదా ఆధార్ OTP ఎంటర్ చేయడం ద్వారా రీసెట్ చేయాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ యాప్‌లైన పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చేసే పేమెంట్లపై పిన్ అవసరం అవసరం ఉండదు. కేవలం ఫేస్ స్కాన్, ఫింగర్‌ప్రింట్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.
పిన్ లేకుండానే UPI పేమెంట్లు :
ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఒక రోజులో మల్టీ పేమెంట్స్ చేసే యూజర్లకు ప్రతిసారీ పిన్‌ను ఎంటర్ చేయకుండానే ఈజీగా పేమెంట్లు పూర్తి చేయొచ్చు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పిన్-ఫ్రీ యూపీఐ పేమెంట్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇకపై వినియోగదారులు ఏదైనా యూపీఐ అప్లికేషన్‌లో పేమెంట్ చేసినప్పుడు తమ ఫింగర్ ఫ్రింట్ స్కాన్ ద్వారా లేదా ఫేస్ ఐడెంటిటీ ద్వారా పేమెంట్ ఆప్షన్ పొందవచ్చు.
అంతేకాదు.. ఆన్‌లైన్ మోసాలను అరికట్టగలదని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ విశ్వసిస్తున్నారు. ఎందుకంటే.. ఒక వ్యక్తి బయోమెట్రిక్ డేటాను ఫేక్ చేయడం దాదాపు అసాధ్యం. ఈ ఫీచర్ యూపీఐ పేమెంట్లు ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి లావాదేవీకి పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ కంపెనీలు అధికారికంగా ఈ ఫీచర్‌ను అమలు చేయనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి. రబీ శంకర్, యూపీఐ మల్టీ-సిగ్నేటరీ అకౌంట్స్ ఫీచర్‌ను కూడా ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా జాయింట్ అకౌంటుదారులు మల్టీ పేమెంట్లును పూర్తి చేయొచ్చు. వేరబుల్ డివైజ్‌ల కోసం యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చిన్న మొత్తంలో లావాదేవీలను పూర్తిచేయొచ్చు. వినియోగదారులు ఫోన్ లేదా పిన్ లేకుండా QR కోడ్ స్కాన్, వాయిస్ ద్వారా అథెంటికేట్ చేసి హ్యాండ్స్-ఫ్రీ పేమెంట్లను పూర్తి చేయొచ్చు.