Valentine Day Sale : ఆఫర్ అదిరింది మావా.. 50MP సెల్ఫీ కెమెరా, ఈ ఒప్పో ఫోన్ ఇలా కొన్నారంటే రూ. 10వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?
Valentine Day Sale : ఒప్పో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. క్రోమాలో రూ. 10వేల డిస్కౌంట్‌తో ఒప్పో రెనో 14 ప్రో 5జీ ఫోన్ లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలంటే?
Oppo Reno 14 Pro 5G
- ఒప్పో రెనో 14 ప్రో 5జీ ఫోన్ పై బంపర్ డిస్కౌంట్
- 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర రూ. 54,999
- బ్యాంకు ఆఫర్లతో ఈ ఒప్పో ఫోన్ రూ. 10,500 తక్కువకే
Valentine Day Sale : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో రెనో 14 ప్రో 5Gపై అద్భుతమైన ఆఫర్.. వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఒప్పో రెనో 15 5జీ లేటెస్ట్ వెర్షన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ సిరీస్‌లో పాత స్మార్ట్ఫోన్లపై బిగ్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఒప్పో రెనో 14 ప్రో 5G ఆకట్టుకునే ఫీచర్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ 6200mAh బ్యాటరీతో లభిస్తోంది. ఒప్పో రెనో 14 ప్రో 5జీ ఫోన్ ధర అసలు ధర కన్నా చాలా తక్కువ. డిస్కౌంట్‌తో పాటు, క్యాష్‌బ్యాక్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒప్పో రెనో 14 ప్రో 5G ఆఫర్లు, ధర తగ్గింపు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
ఒప్పో రెనో 14 ప్రో 5G ధర ఎంతంటే? :
ఒప్పో రెనో 14 ప్రో 5జీ అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వెర్షన్ సాధారణ ధర రూ. 54,999కు అందిస్తోంది. అయితే, క్రోమా ధర నుంచి 11శాతం కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. ఈ ఒప్పో ఫోన్ ఇప్పుడు రూ. 48,879 ధరకు లభిస్తోంది. నేరుగా రూ. 6వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
ఒప్పో రెనో 14 ప్రో 5G సేల్, బ్యాంక్ ఆఫర్లు :
కంపెనీ ఒప్పో రెనో 14 ప్రో 5జీపై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఎస్బీఐ, కోటాక్, యశ్ లేదా ఐడీఎఫ్సీ నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా 6 లేదా 12 నెలల ఈఎంఐ ప్లాన్‌పై ఫోన్ కొనొచ్చు. తద్వారా రూ. 4,500 వరకు సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఒప్పో ఫోన్ మొత్తంగా రూ. 10,500 తక్కువకే మీ సొంతం అవుతుంది.
ఒప్పో రెనో 14 ప్రో 5G ఫీచర్లు :
ఒప్పో రెనో 14 ప్రో 5జీ ఫోన్ 6.59-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 సీపీయూ ద్వారా పవర్ పొందుతుంది. రెనో 14 ప్రో 5జీ 6200mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అందిస్తుంది.
ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా అనే 3 బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం వీడియో కాల్స్, ఫ్రంట్ కెమెరా 50MP ఫీచర్లు ఉన్నాయి. IP68, IP69 రేటింగ్ కూడా ఉంది. రీఫ్ బ్లాక్, మెర్మైడ్, కల్లా లిల్లీ పర్పుల్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
