Vi Roaming Plans : విదేశాలకు వెళ్తున్నారా? Vi ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు.. డబుల్ డేటా, ట్రావెల్ ప్రొటెక్షన్..!

Vi Roaming Plans : వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది.

Vi Roaming Plans

Vi Roaming Plans : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ వేసవిలో విదేశాల్లో ప్రయాణించే కస్టమర్ల కోసం అంతర్జాతీయ పోస్ట్‌పెయిడ్ రోమింగ్ ప్లాన్‌లను (Vi Roaming Plans) అప్‌డేట్ చేసింది.

Read Also : Apple iPhone 15 : బిగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే ఐఫోన్ 15.. ఇది కదా ఆఫర్ అంటే.. కొనేసుకోండి..!

సమ్మర్ హాలిడేస్ సందర్భంగా భారతీయులు ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. వీరికోసం వోడాఫోన్ ఐడియా అప్‌గ్రేడ్ IR ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు రెట్టింపు డేటా, ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్, ట్రావెల్ ప్రొటెక్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

3 రోమింగ్ ప్లాన్‌లపై డబుల్ డేటా :
కొత్తగా అప్‌డేట్ చేసిన ప్లాన్‌లలో రూ.649, రూ.2,999, రూ.3,999 IR ప్యాక్‌లు ఉన్నాయి. గతంలో, ఈ ప్లాన్ వరుసగా 500MB, 5GB, 12GB డేటాను అందిస్తుంది. ఇప్పుడు, వినియోగదారులు రోమింగ్ ప్లాన్‌లపై అదనపు ఖర్చు లేకుండా 1GB, 10GB, 30GB డేటాను పొందవచ్చు.

ఒక్కో ప్లాన్‌లో సపరేట్ వ్యాలిడిటీలు :

రూ. 649 ప్లాన్: ఒక రోజు వ్యాలిడిటీ
రూ. 2,999 ప్లాన్ : 10 రోజుల వ్యాలిడిటీ
రూ. 3,999 ప్లాన్ : 30 రోజుల వ్యాలిడిటీ

ఈ 3 ప్లాన్‌లు అంతర్జాతీయ ప్రయాణాలకు బాగా సరిపోతాయి.

ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్, SMS బెనిఫిట్స్ :
మూడు అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఇప్పుడు అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్‌తో వస్తాయి. అవుట్‌గోయింగ్ కాల్స్ పరిమితమని గమనించాలి.

రూ. 649కు 50 నిమిషాలు
రూ. 2,999కు 300 నిమిషాలు
రూ. 3,999కు 1,500 నిమిషాలు
వినియోగదారులు ప్లాన్‌ను బట్టి 10, 50, 100 ఫ్రీ SMS పొందవచ్చు.

ప్రీ-యాక్టివేషన్, బ్యాగేజ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ :
Vi యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా 60 రోజుల ముందుగానే ప్యాక్ యాక్టివేషన్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియాపార్టనర్‌షిప్ కారణంగా కస్టమర్‌లు బ్లూ రిబ్బన్ బ్యాగ్స్‌తో రూ.99కి బ్యాగేజీ ప్రొటెక్షన్ ఎంచుకోవచ్చు.

Read Also : SwaRail App : వావ్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘SwaRail’తో ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

చెక్-ఇన్ చేసిన లగేజీ 96 గంటలకు మించి ఆలస్యమైనా లేదా పోయినా తద్వారా ఒక్కో బ్యాగ్‌కు రూ.19,800 వరకు పరిహారం లభిస్తుంది. వోడాఫోన్ ఐడియా కొత్త పోస్ట్‌పెయిడ్ రోమింగ్ ప్లాన్‌లు ప్రయాణ సమయాల్లో మెరుగైన డేటా, కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు.