Vi Insurance Plan
Vi Insurance Plan : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. మీరు వోడాఫోన్ ఐడియా (Vodafone idea) సిమ్ కార్డును వాడుతున్నారా? మీకో అద్భుతమైన ఆఫర్.. Vi కంపెనీ మొట్టమొదటిసారిగా కొత్త ఏఢాదికి ముందు తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేకించి Vi ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం హ్యాండ్‌సెట్ థెఫ్ట్, ఫోన్ డ్యామేజ్ కావడం నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు కంపెనీ స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది.
ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు సపరేటుగా (Vi Insurance Plan) కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లతో ఉచితంగా అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. దొంగతనం, హ్యాండ్‌సెట్ నష్టం వంటివి మినహాయింపు ఉంటుంది. కానీ, ఈ ఆఫర్ ద్వారా Vi ప్రీపెయిడ్ యూజర్లకు అదనపు ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఇన్సూరెన్స్ కవరేజీ ఎంతంటే? :
ఈ హ్యాండ్‌సెట్ దొంగిలించినా లేదా కోల్పోయినా మీకు రూ. 25వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. క్లెయిమ్‌ల ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో స్పీడ్ గా ప్రాసెస్ ఉంటుంది. ఇందుకోసం కస్టమర్ డేటాను యాక్సస్ చేయనున్నట్టు కూడా కంపెనీ చెబుతోంది.
3 ప్రీపెయిడ్ ప్యాక్‌లతో బీమా కవరేజీ :
ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కంపెనీ 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లతో ప్రవేశపెట్టింది. రూ.61 రీఛార్జ్‌తో 2GB డేటా, 15 రోజుల వ్యాలిడిటీ, 30 రోజుల ఫోన్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. రూ.201 రీఛార్జ్‌తో 10GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, 180 రోజుల ఇన్సూరెన్స్ లభిస్తుంది. రూ.251 ధరతో మూడో ప్లాన్‌తో 10GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, 365 రోజుల ఇన్సూరెన్స్ లభిస్తుంది.
టెలికాం ఆపరేటర్ ప్రకారం.. ఈ రీఛార్జ్ ప్యాక్‌లు హ్యాండ్‌సెట్ నష్టం లేదా దొంగతనం నుంచి ప్రొటెక్షన్ కోసం రూ.25,000 వరకు బీమా, ఇతర డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ థెఫ్ట్, డివైజ్ లాస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది భారతీయ మార్కెట్లోని వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లలో ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు వర్తిస్తుంది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్‌లతో ఈ బీమాను పొందవచ్చు.