Vi launches new yearly prepaid plan Rs 3199 with free Amazon Prime subscription
Vi New Year Plan : భారత్‌లో ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర కేవలం రూ. 3199 మాత్రమే.. ఈ టాప్ ప్లాన్ వినియోగదారులకు ఏడాది మొత్తం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. టెలికం మార్కెట్‌లో ఇదే అత్యుత్తమ ఆఫర్‌గా చెప్పవచ్చు.
Read Also : Vodafone-Idea Plans : వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ కొంటే బెటర్? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే?
ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ రోజువారీగా పొందవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి అందిస్తోంది. మొబైల్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఒక ఏడాది సభ్యత్వాన్ని అందిస్తుంది. అదనపు ఛార్జీ లేకుండా అందిస్తుంది.
వారాంతపు ఉచిత డేటా పొందవచ్చు :
వోడాఫోన్ ఐడియా కస్టమర్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ రేంజ్ మూవీలు, టీవీ కార్యక్రమాలు, ప్రత్యేకమైన కంటెంట్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ యూజర్లకు కాల్‌లు, మెసేజ్‌లు, డేటా వంటి ప్రాథమిక ఫీచర్‌లకు మించి విఐ అదనపు పెర్క్‌లను అందిస్తోంది.
Vi launches new yearly prepaid plan
వినియోగదారులు తమ సాధారణ డేటాకు ఎలా అంతరాయం లేకుండా అర్ధరాత్రి ఉదయం 6 గంటల మధ్య ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉచితంగా డేటాను ఉపయోగించుకోవచ్చు. అదనంగా, ప్లాన్ వారాంతపు డేటాను కూడా అందిస్తుంది, వినియోగదారులు ఉపయోగించని డేటాను కోల్పోకుండా ఉపయోగించుకోవచ్చు.
ఏ ప్లాన్ ధర ఎంతంటే? :
వోడాఫోన్ ఐడియా రూ. 3199 ప్లాన్ సహా లైనప్‌లో ఇతర ఆకర్షణీయమైన ప్లాన్‌లను కలిగి ఉంది. మొబైల్ యూజర్ల కోసం రూ. 3099కు డిస్నీ+ హాట్‌స్టార్‌కు 365 రోజుల సబ్‌స్క్రిప్షన్, అలాగే, రూ. 903కు 90 రోజుల సోనీ లైవ్ ప్రీమియం మొబైల్ సబ్‌స్క్రిప్షన్, రూ. 902 ధరకు సన్ నెక్స్ట్ (టీవీ+ మొబైల్) సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల వరకు, రూ. 901 ధరకు మొబైల్ యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌కు 70 రోజుల సభ్యత్వాన్ని పొందవచ్చు.
వోడాఫోన్ ఐడియా యూజర్లు ఈ వార్షిక ప్లాన్‌లో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనెక్టివిటీని మాత్రమే కాకుండా అనేక ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. విఐ అందించే ఈ సంచలనాత్మక ఆఫర్ సరసమైన ధరలో మంచి వినోదాన్ని పొందవచ్చు.