Vodafone Idea Plans : వోడాఫోన్ రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. అదనపు హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌లను Vi ఇటీవల ప్రవేశపెట్టింది.

Vodafone Idea launches two new recharge plans with unlimited data benefits
Vodafone Idea Plans : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వోడాఫోన్-ఐడియా (Vodafone Idea) ఆర్థిక పరిమితుల కారణంగా ఇప్పటికీ 5G రేసులో వెనుకబడి ఉంది. అయినప్పటికీ, 5Gలో వినియోగదారులకు కొత్త ప్లాన్‌లు, ఆఫర్‌లను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లిమిటెడ్ పిరియడ్ డేటా రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్లు రూ. 24, రూ. 49 ధరలతో అందుబాటులో ఉన్నాయి. కొత్త ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు ‘సూపర్ అవర్’, ‘సూపర్ డే’ డేటా ప్యాక్‌ల పేరుతో వచ్చాయి.
వీడియో గేమ్ ఆడేటప్పుడు తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన యూజర్ల కోసం Vi ఈ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల రోజువారీ డేటా కోటా తక్కువగా ఉండవచ్చు. ఖరీదైన యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లను వినియోగదారులు కొనుగోలు చేయలేరు. ఈ ప్యాక్‌లు Vi ప్రీపెయిడ్ యూజర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా డేటాను ఉచితంగా వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తాయి. (Vi) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ల కింద అందిస్తున్న ఆఫర్‌లను వివరంగా పరిశీలిద్దాం.
Vi సూపర్ అవర్ ప్లాన్ వివరాలు :
ఈ ప్లాన్ ధర రూ. 24 మాత్రమే.. కేవలం గంట పాటు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. Vi యూజర్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ 4G డేటాను పొందవచ్చు. అయితే, ఒక గంట వ్యవధి తర్వాత యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ల ఆధారంగా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.
Read Also : Vodafone-Idea Plans : వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ కొంటే బెటర్? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే?
Vi సూపర్ డే ప్లాన్ వివరాలు :
ఈ ప్లాన్ 24 గంటల వ్యాలిడిటీతో వస్తుంది. రూ. 6GB హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. రూ. 49 ప్లాన్ 1 రోజు వరకు డేటా టాప్ అప్‌ను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా ఇంటర్నెట్ డేటాను ఉపయోగించవచ్చు. రెండు ప్లాన్‌లు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు కావడంతో ఎలాంటి కాలింగ్ లేదా SMS వ్యాలిడిటీ అందించవు. ఈ ప్లాన్‌ల కోసం యాక్టివ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉండాలి. ఈ సాచెట్ ప్యాక్‌లు ప్రత్యేకించి భారీ డేటా వాడే యువత, యువకుల కోసం రూపొందించింది. Vi ప్రీపెయిడ్ వినియోగదారులు టీవీలు చూడటం, వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, మ్యూజిక్ వినడం, గేమ్‌లు ఆడటం, సర్ఫింగ్, చాటింగ్, చేస్తూనే ఎంజాయ్ చేయొచ్చు.

Vodafone Idea launches two new recharge plans with unlimited data benefits
Vi కస్టమర్‌లు Vi గేమ్‌లను ఆడటానికి, Vi Movies & TVలో లేటెస్ట్ సినిమాలు, వీడియోలను ఆస్వాదించడానికి Vi యాప్‌లో Vi Musicలో తమకు ఇష్టమైన పాటలను వినడానికి ఈ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. Vi బేస్ ప్లాన్ ధరను పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. టెల్కో ప్రస్తుత బేస్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. గతంలో రూ. 99 ప్లాన్‌పై 28 రోజుల వ్యాలిడిటీని అందించింది. ఈ ప్లాన్ కొత్త వ్యాలిడిటీ 15 రోజులకు తగ్గింది.
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. ముంబైలో, గుజరాత్‌లో Vi టారిఫ్ ప్లాన్‌లలో గణనీయమైన మార్పులు చేసింది. ఈ ప్రాంతాలలో Vi కనీస రీఛార్జ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించింది. రూ.99 ప్లాన్ గతంలో 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇప్పుడు 15 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అదేవిధంగా, రూ.128 ప్లాన్ ఇప్పుడు 28 రోజులకు బదులుగా 18 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. వ్యాలిడిటీ తగ్గినప్పటికీ, ఈ ప్లాన్‌ల ఇతర బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి. రూ.99 ప్లాన్ ఇప్పటికీ 200MB డేటాతో పాటు SMSలను మినహాయించి విలువైన టాక్‌టైమ్‌ను అందిస్తుంది.