Vijay Sales Dhanteras _ Deals on smartphones, laptops and other gadgets
Vijay Sales extravaganza : దీపావళి పండుగను పురస్కరించుకుని ధన్తేరస్ మొదటి రోజు సందర్భంగా విజయ్ సేల్స్ అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో షాపింగ్ చేయాలనుకున్నా, రిటైల్ జాయింట్ సేల్ దీపావళి నిర్దిష్ట డీల్‌లను అందిస్తోంది.
అంతేకాదు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, వన్ కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్, అమెక్స్ లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే రూ. 7,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు పొందవచ్చు. విజయ్ సేల్స్ దీపావళి సెలబ్రేషన్ కొన్ని పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు, టెక్ గాడ్జెట్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి మరిన్నింటిపై అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. దీపావళి సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
సన్‌సయి 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ రూ. 11,499 వద్ద అందుబాటులో ఉంది. 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రెడ్‌మి నోట్ 12 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 15,499 ధరకు అందుబాటులో ఉంది. నోయిస్‌ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 2,099 వద్ద అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో బోట్ ఎయిర్‌డోప్స్ 148 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ రూ. 999 ధరకు పొందవచ్చు. ఆపిల్ అభిమానులు ఆపిల్ 2023 మ్యాక్‌బుక్ ప్రో (14 అంగుళాల/M3 చిప్) సరికొత్త లాంచ్‌ను రూ. 1,64,900 (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో సహా) అందిస్తుంది.
అదే సమయంలో, విండోస్ 11తో పాటు 8జీబీ డీడీఆర్4, 512జీబీ ఎస్ఎస్‌డీ కలిగిన హెచ్‌పీ 14 అంగుళాల ల్యాప్‌టాప్ రూ. 26,990 ధరకు అందుబాటులో ఉంది. రూ. 13,499 నుంచి ప్రారంభమయ్యే టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్‌మి, ఒప్పో, వివో, శాంసంగ్ వంటి మరిన్ని బ్రాండ్‌ల నుంచి పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా రూ. 6,999 నుంచి లభించే స్మార్ట్‌ఫోన్‌లపై విజయ్ సేల్స్ ఆఫర్‌లను అందిస్తోంది.
Vijay Sales Dhanteras Top Deals
రిటైల్ స్టోర్ వాషింగ్ మెషీన్‌లపై రూ. 8,699 నుంచి ప్రారంభమయ్యే డీల్‌లను కూడా అందిస్తోంది. అదే సమయంలో గీజర్‌ల ధరలు రూ. 3,299, మైక్రోవేవ్‌లు, ఓటీజీలు రూ. 3,799 నుంచి, మిక్సర్‌లు జ్యూసర్‌లు, బ్లెండర్‌ల ధరలు రూ. 1,485 నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు ఐరన్, గార్మెంట్ స్టీమర్‌లపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఎయిర్ ఫ్రైయర్‌లపై 52 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆసక్తి గల కస్టమర్‌లు రూ. 16,490 నుంచి ప్రారంభ-స్థాయి ల్యాప్‌టాప్‌లు, రూ. 50,990 నుంచి ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్‌లు, రూ. 8,499 నుంచి ఐప్యాడ్స్, టాబ్లెట్‌లు రూ. 170 నుంచి వివిధ కంప్యూటర్ అప్లియన్సెస్ కొనుగోలు చేయొచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ. 15వేలు పైగా చేసే క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 3వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 60వేలకు పైగా చేసే క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 3వేలు లేదా 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Vijay Sales Dhanteras
రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ. లక్షకు పైగా చేసే క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ, ఈఎంఐ యేతర లావాదేవీలపై రూ. 5వేలు ఇన్‌స్టంట్ ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. లక్ష కన్నా ఎక్కువ ఈఎంఐ యేతర లావాదేవీలపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.