Vivo V70 Lite 4G : వారెవ్వా.. కొత్త వివో 4G ఫోన్ ఆగయా.. డ్యూయల్ 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ హైలెట్..!

Vivo V70 Lite 4G : వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. ఈ 4జీ ఫోన్ డ్యూయల్ 50ఎంపీ కెమెరాలతో పాటు 8100mAh బ్యాటరీతో ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు.

Vivo V70 Lite 4G smartphone

  • వివో V70 లైట్ 4G ఫోన్‌లో 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
  • సేఫ్టీ కోసం ఈ ఫోన్ డిస్‌ప్లేలో ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌
  • ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్6పై రన్నింగ్

Vivo V70 Lite 4G : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. వివో V70 లైట్ 4G వచ్చేసింది. కంపెనీ ఈసారి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ 4G వేరియంట్ తీసుకొచ్చింది. గతంలో 5G వేరియంట్‌లో వచ్చింది. వివో V70 లైట్ 4Gలో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.

సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 8100mAh బ్యాటరీ ఈ ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. వివో V70 లైట్ 4G ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో V70 లైట్ 4G ధర, లభ్యత :
వివో V70 లైట్ 4G ఫోన్ యూరేషియా మార్కెట్లో లాంచ్ అయింది. అతి త్వరలో ఇతర మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ ధరను బ్రాండ్ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, రెండు కలర్ వేరియంట్లలో రానుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు అధికారిక వెబ్‌సైట్‌లో రివీల్ అయ్యాయి.

వివో V70 లైట్ 4G స్పెసిఫికేషన్లు :
ఈ వివో V70 లైట్ 4G ఫోన్ భారీ 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్‌ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 2800 x 1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

Read Also : BSNL Cheapest Plan : యూజర్లకు పండగే.. రోజూ 2GB డేటా కావాలా? BSNL 72 రోజుల చౌకైన ప్లాన్ ఇదే!

ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్ యునిసోక్ T7300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB LPDDR4X ర్యామ్, 128GB, 256GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది.

వివో V70 లైట్ 4Gలో 50MP రియర్ కెమెరాతో పాటు, పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2MP డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వివో V70 లైట్ 4Gలో భారీ 8,100mAh బ్యాటరీ ఉంది. ఒక రోజు వరకు ఛార్జింగ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2 రోజుల వరకు వస్తుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ అందిస్తుంది.