Vivo S18 Series : ఈ నెల 14న వివో S18 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Vivo S18 Series : వివో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే వివో ఎస్18 సిరీస్ కీలక ఫీచర్లు లీకయ్యాయి. ఇందులో వివో ఎస్18, ఎస్18ప్రో, వివో ఎస్18ఇ అనే మొత్తం మోడల్స్ ఉన్నాయి.

Vivo S18 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త S సిరీస్ మోడల్ రాబోతోంది. ఈ నెల (డిసెంబర్) 12న గ్లోబల్ మార్కెట్లో వివో ఎస్18 సిరీస్ లాంచ్ కానుంది. 2023 ఏడాదిలో మేలో ఆవిష్కరించిన వివో ఎస్17కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది. అతి త్వరలో చైనాలో ఈ కొత్త ఎస్18 సిరీస్ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

రాబోయే సిరీస్‌లో మొత్తం మూడు మోడల్‌లు ఉంటాయి. అందులో బేస్ వివో ఎస్18, వివో ఎస్18ప్రో, వివో ఎస్18ఇ ఫోన్లు ఉంటాయి. కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ మోడల్‌ల కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది. ఇంతలో, వివో టీడబ్ల్యూఎస్ 3ఇ ఇయర్‌బడ్‌లు కూడా హ్యాండ్‌సెట్‌లతో లాంచ్ కానున్నాయి.

డిసెంబర్ 14న చైనాలో లాంచ్ :
వివో ఎస్18, వివో ఎస్18 ప్రో, వివో ఎస్18ఇ అనే ఈ మూడు మోడల్స్ డిసెంబర్ 14న స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు చైనాలో లాంచ్ అవుతుందని ప్రకటించింది. వివో టీడబ్ల్యూఎస్ 3ఇ ఇయర్‌బడ్స్ కూడా అదే ఈవెంట్‌లో లాంచ్ అవుతాయని కంపెనీ ధృవీకరించింది. ఈ ఇయర్‌ఫోన్‌లు మే 2021లో ప్రవేశపెట్టిన వివో టీడబ్ల్యూఎస్ 2ఇ మోడల్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్రకటనతో, కంపెనీ రాబోయే ప్రొడక్టులకు సంబంధించి తయారీ, కలర్ ఆప్షన్లు, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది.

Read Also : Redmi 13C 5G Launch : రెడ్‌మి 13C 5జీ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర కేవలం రూ. 10,999 మాత్రమే!

ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లు :
వివో ఎస్18, ఎస్18 ప్రో మోడల్‌లు బ్లాక్, జేడ్, పోర్సిలైన్ కలర్ ఆప్షన్‌లలో కనిపిస్తాయి. ఈ మోడల్‌ల ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లు బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కెమెరా మాడ్యూల్‌లో రానుంది. మరోవైపు, వివో ఎస్18ఇ డ్యూయల్ రియర్ కెమెరాలతో పాటు డ్యూయల్ రింగ్ లాంటి ఎల్ఈడీ యూనిట్‌లతో కనిపిస్తుంది. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌లో ఉండనున్నాయి. అన్ని ఫోన్‌లు ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లు డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌లతో కనిపిస్తాయి.

Vivo S18 Series Launch

టీజర్ పేజీ ప్రకారం.. వివో ఎస్18 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఇంతలో, బేస్ వివో ఎస్18 స్నాప్‌డ్రాగన్ 7 జెనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5,000ఎంఎహెచ్ అల్ట్రా-సన్నని ఓసియన్ బ్యాటరీ” ఉండనుంది. వివో ఎస్18ఇ 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. వివో ఎస్18ఇ మోడల్ కూడా 7.9ఎమ్.ఎమ్ మందాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్లలో బ్లాక్, గ్రే, పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి.

వివో ఎస్18 ప్రోలో ఓఐఎస్ సపోర్టు సెన్సార్లు :
వివో ఎస్18 ప్రోలో వివో ఎక్స్100 మాదిరి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్టుతో సోనీ 50ఎంపీ వీసీఎస్ బయోనిక్ ఐఎమ్ఎక్స్920 ప్రైమరీ సెన్సార్‌తో కూడా వస్తుందని వివో చైనా ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ ధృవీకరించారు. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లోని ఇతర 2 కెమెరాలు అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 50ఎంపీ శాంసంగ్ జేఎన్1 సెన్సార్, 12ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్663 పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లో డ్యూయల్ ఫ్లాష్ యూనిట్‌తో కూడిన 50ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది.

టీజర్ పేజీలో వివో ఎస్18, వివో ఎస్18 ప్రో కూడా హుక్సాయా రెడ్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటాయని సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ ఫోన్‌లు 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయని కూడా పేర్కొంది. వివో టీడబ్ల్యూఎస్ 3ఇ ఇయర్‌ఫోన్‌లకు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. టీజర్‌లో, ఇయర్‌బడ్‌లు బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఉన్నాయి.

Read Also : Vivo Y100i Launch : భారీ బ్యాటరీతో వివో Y100ఐ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు