Vivo S30 Series : వివో S30 సిరీస్ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. మొత్తం 2 ఫోన్లు.. ధర ఎంతో తెలుసా?

Vivo S30 Series : వివో S30 సిరీస్ లాంచ్ అయింది. ఫ్లాగ్ షిప్ ఫీచర్లు, కాంపాక్ట్ డిజైన్‌తో అత్యంత ఆకర్షణగా ఉన్నాయి. ధర వివరాలివే..

Vivo S30 Series

Vivo S30 Series : కొత్త వివో సిరీస్ వచ్చేసింది. వివో S30, వివో S30 ప్రో మినీ ఫోన్లు చైనీస్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. బేస్, కాంపాక్ట్ ఫారమ్‌తో ఆకట్టుకునే హార్డ్‌వేర్‌తో వచ్చాయి.

వివో S30 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వివో S30 ప్రో మినీ స్క్రీన్‌ను 6.31-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్‌ అందిస్తుంది.

Read Also : iPhone 26 : బిగ్ అప్‌డేట్.. రాబోయే ఐఫోన్ 17 కాదట.. ఐఫోన్ 26 పేరుతో లాంచ్ చేయనుందా? ఆపిల్ కొత్త ప్లాన్ ఇదేనా? ఫుల్ డిటెయిల్స్..!

ఈ ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ ప్రాసెసర్‌తో అప్‌గ్రేడ్ అయింది. వచ్చే జూన్ 6 నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

వనిల్లా S30తో పోటీగా వివో S30 ప్రో మినీ భారీ 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 186 గ్రాములు, కేవలం 7.99mm మందం మాత్రమే ఉంటుంది. అత్యంత కాంపాక్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

వివో ప్రో-గ్రేడ్ కెమెరా సెటప్ :
వివో 2 ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తాయి. 50MP మెయిన్ సెన్సార్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ షూటర్. S30లో OISతో సోనీ LYT-700V సెన్సార్ ఉంది.

అయితే, వివో S30 ప్రో మినీలో సుపీరియర్ సోనీ IMX921 ఉంది. పెరిస్కోప్ లెన్స్ రెండింటిలోనూ IMX882 సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం ఆటోఫోకస్‌తో 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను పొందవచ్చు.

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ (Vivo S30 Series) సిస్టమ్ :
వివో S30 సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 5పై రన్ అవుతుంది. వివో S30 IP64 వాటర్, డస్ట్ నిరోధకతను అందిస్తుంది. అయితే, వివో ప్రో మినీ IP68/69 రేటింగ్‌ను కలిగి ఉంది.

కలర్ ఆప్షన్లు, ధర ఎంతంటే? :
వివో S30 ఫోన్ పీచ్ పింక్, మింట్ గ్రీన్, లెమన్ ఎల్లో, కోకో బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో ప్రో మినీ కూల్ బెర్రీ పౌడర్, మింట్ గ్రీన్, లెమన్ ఎల్లో, కోకో బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

చైనాలో వివో S30 ధర :
వివో S30 సిరీస్ మల్టీ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేస్ వెర్షన్ వివో S30 రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ ధర CNY 2,699 (సుమారు USD 374), 12GB ర్యామ్, 512GB స్టోరేజీ ధర CNY 2,999 (సుమారు USD 416) డాలర్లు ఉంటుంది. అదనంగా, హై-ఎండ్ 16GB + 512GB మోడల్ CNY 3,299 (సుమారు USD 457 డాలర్లు)కు అందుబాటులో ఉంది.

Read Also : Motorola G Series : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. పిచ్చెక్కించే ఫీచర్లతో 3 కొత్త మోటోరోలా G సిరీస్ ఫోన్లు.. ధర ఎంతంటే?

మరోవైపు, వివో S30 ప్రో మినీ 12GB + 256GB వేరియంట్ CNY 3,499 (USD 485) నుంచి ప్రారంభమవుతుంది. ఈ వివో ఫోన్ 2 హై-ఎండ్ ఆప్షన్లలో కూడా వస్తుంది. 16GB + 256GB ధర CNY 3,799 (USD 527), టాప్-టైర్ 16GB + 512GB వెర్షన్ ధర CNY 3,999 (USD 555) డాలర్లకు అందుబాటులో ఉంది.