Vivo T1X India : డ్యుయల్ కెమెరాలతో వివో T1X ఇండియా ఫోన్ వస్తోంది.. ఈ నెల 20నే లాంచ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియా నుంచి కొత్త T1X ఇండియా సిరీస్ ఫోన్ రాబోతోంది. Vivo T1X India లాంచ్ తేదీని అధికారికంగా ధ్రువీకరించింది.

Vivo T1x India Launch Date Officially Confirmed, To Feature Dual Cameras On The Back

Vivo T1X India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియా నుంచి కొత్త T1X ఇండియా సిరీస్ ఫోన్ రాబోతోంది. Vivo T1X India లాంచ్ తేదీని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ కొత్త Vivo T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ జూలై 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రెండు రోజుల ముందే Vivo T1X లాంచ్ తేదీని వెల్లడించింది. Vivo T1X ఇండియా వేరియంట్ కూడా మలేషియాలో లాంచ్ అయింది. అదే మాదిరిగానే ఈ కొత్త T1X స్మార్ట్ ఫోన్ ఉండనుంది. బ్లూ, బ్లాక్ అనే రెండు రంగులలో ఫోన్ లాంచ్ అవుతుందని టీజర్ ద్వారా వెల్లడించింది. దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ లోపల డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంది.

Vivo T1X 4G మలేషియాలో లాంచ్ అయిన డివైజ్‌లో స్నాప్‌డ్రాగన్ 680 SoCని కలిగి ఉంటుంది. ఈ డివైజ్ 4GB/6GB RAMతో పాటు 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 5000 mAh బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Vivo T1x India Launch Date Officially Confirmed, To Feature Dual Cameras On The Back

ముందు భాగంలో.. T1X భారీ 6.58-అంగుళాల Full HD+ IPS LCDని పొందవచ్చు. స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్‌ కలిగి ఉంది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. Vivo T1X మలేషియా వేరియంట్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2MP సెన్సార్లు ఉన్నాయి.

ఇండియా వేరియంట్, టీజర్ ప్రకారం.. డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం కెమెరా సెన్సార్ల గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఫ్రంట్ సైడ్ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో Vivo T1X ధర సుమారు రూ. 15వేల నుంచి ఉండవచ్చని అంచనా. మల్టీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Vivo T1X 5G India : ఈ నెల 20న Vivo T1X 5G వేరియంట్ వస్తోంది.. ఫీచర్లు ఇవేనా?