Vivo T1x India Launch Date Revealed, 5g Variant Likely To Debut In July
Vivo T1X 5G India : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి T సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ నెల (జూలై 20)న Vivo T1X 5G వేరియంట్ లాంచ్ కానుంది. భారత్‌లో కొత్త వివో Vivo T1X స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ అధికారికంగా కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ జూలై 20న లాంచ్ కానుందని టెక్ వర్గాలు వెల్లడించాయి. Vivo T1X 4G 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4G వేరియంట్ ఈ ఏడాది ప్రారంభంలో మలేషియాలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 680 SoCతో వచ్చింది. మరోవైపు, చైనాలో MediaTek డైమెన్సిటీ 900 SoCతో Vivo T1X 5G లాంచ్ అయింది. Vivo T1X రెండు వేరియంట్‌లు భారత మార్కెట్లో లాంచ్ అవుతున్నాయో లేదో క్లారిటీ లేదు. త్వరలో 5G వేరియంట్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే భారత మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 680 SoCతో Vivo T1 44W వేరియంట్ అందుబాటులో ఉంది. Vivo మలేషియా వేరియంట్ మాదిరిగా భారత మార్కెట్లోనూ Vivo T1X 5G డైమెన్సిటీ 900 SoCతో లాంచ్ కానుంది. పూర్తిగా ధరను పోటీగా ఉంచడానికి కంపెనీ కొన్ని హార్డ్‌వేర్ మార్పులు చేయవచ్చు. చైనా నుంచి Vivo T1X 5G ఇండియాకు వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.58-అంగుళాల Full HD+ IPS LCDని కలిగి ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా కోసం ఫోన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది.
Vivo T1x India Launch Date Revealed, 5g Variant Likely To Debut In July
Vivo భారత్‌లో 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో T1X 5Gని రిలీజ్ కానుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో రానుంది. బాక్స్ వెలుపల 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50MP f/1.8 ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో సెన్సార్ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మొదలైనవి ఉన్నాయి. చైనాలో Android 11తో వస్తుంది. భారత్ వేరియంట్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది.
Read Also : Vivo Y33e 5G : వివో Y33e 5G బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?