Vivo T3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌కు వివో T3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం ధర రూ 12,499 మాత్రమే..!

Vivo T3x 5G Launch : భారత మార్కెట్లో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ వివో ఫోన్ రూ.13,499 ప్రత్యేక ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ 5జీ ఫోన్ రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు.

Vivo T3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌కు వివో T3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం ధర రూ 12,499 మాత్రమే..!

Vivo T3x 5G launched in India, price effectively starts from Rs 12,499

Vivo T3x 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఇండియా సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. అత్యంత వేగవంతమైన ఈ కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. వివో టీ3ఎక్స్ 5జీ ప్రత్యేక ధర రూ. 13,499 వద్ద లాంచ్ చేసింది. అయితే, బ్యాంక్ ఆఫర్లతో ఈ వివో ఫోన్ రూ.12,499కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

వివో టీ3ఎక్స్ 5జీ లాంచ్.. ధర ఎంతంటే? :
వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ క్రిస్టల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌లో మొత్తం 3 వేరియంట్‌లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్, స్టోరేజ్ 128జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,499కు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ వివో ఫోన్ ప్రత్యేక ధర రూ.13,499కే అందిస్తోంది. దాంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.వెయ్యి తగ్గింపును పొందవచ్చు.

ఈ కస్టమర్లు ఫోన్ ధరను రూ.12,499కి కొనుగోలు చేయొచ్చు. 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వేరియంట్‌లు వరుసగా రూ. 14,999, రూ. 16,499 ప్రత్యేక ధరలలో అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు, రెండు వేరియంట్ల ధరలను మరింత తగ్గించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఏప్రిల్ 24, 2024 నుంచి మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా, ఇ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

టీ3ఎక్స్ 5జీ టాప్ స్పెషిఫికేషన్లు :
వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ+ 2408, 1080 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అదనంగా, డిస్‌ప్లే ఆకట్టుకునే 1000నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్‌నెస్, 339పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 83 శాతం ఎన్‌టీఎస్‌సీ కలర్ గామట్‌తో వస్తుంది.

ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్, అడ్రినో 710 జీపీయుతో పనిచేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా వివో పేర్కొంది. ఈ 5జీ ఫోన్ బరువు 199 గ్రాములు ఉంటుంది. రెండు కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్‌, వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.8 ఎపర్చరుతో వస్తుంది. ఎఫ్/2.4 ఎపర్చరుతో 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.05 ఎపర్చర్‌తో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. హుడ్ కింద వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ 6000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. స్టాండ్‌బై టైమ్ సూపర్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ఓఎస్ 14లో రన్ అవుతుంది.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?