Upcoming Phones : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4, ఐక్యూ Z10 వచ్చేస్తున్నాయి.. ఏప్రిల్‌లోనే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Upcoming Phones : వచ్చే నెలలో భారత మార్కెట్లో 7300mAh బ్యాటరీతో వివో, ఐక్యూ రెండు పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.

Upcoming Phones : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4, ఐక్యూ Z10 వచ్చేస్తున్నాయి.. ఏప్రిల్‌లోనే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Upcoming Phones

Updated On : March 26, 2025 / 5:22 PM IST

Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. చైనా దిగ్గజాలైన ఐక్యూ, వివో భారీ 7,300mAh బ్యాటరీతో కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్నాయి.

Read Also : Jio Offers : జియోనా మజాకా.. చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఏకంగా 200 రోజులు.. ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా..!

ఈ రెండు మోడళ్లు వచ్చే నెల, ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐక్యూ ఫోన్ ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రత్యక్షమైంది. లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 7,000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. ప్రతి బ్రాండ్ అద్భుతైమన ఆఫర్లను అందించనున్నాయి. ఈ రెండు ఫోన్ల ఫీచర్ల వివరాలను రెండు కంపెనీల ఫోన్లు రివీల్ చేశాయి.

ఐక్యూ Z10 :
భారత మార్కెట్లో ఏప్రిల్ 11న ఐక్యూ Z10 ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ గురించి కంపెనీ అధికారిక ఛానెల్‌ ద్వారా టీజ్ చేసింది. ఇప్పటికే ఫోన్ అనేక వివరాలను వెల్లడించింది. రాబోయే ఈ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో రానుంది. కేవలం 7.89mm మందంతో ఆకట్టుకునేలా సన్నగా ఉంటుంది.

ఈ ఫోన్ 7,300mAh బ్యాటరీతో అమర్చి ఉంది. ఐక్యూ Z10 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, 1.5K రిజల్యూషన్‌ను కలిగిన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రావచ్చు. ఆండ్రాయిడ్ 5 ఆధారంగా OriginOS 15పై రన్ అవుతుంది.

Read Also : OnePlus 13T Launch : వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

వివో T4 5G ఫోన్ :
వివో T4 5G మోడల్‌ను వచ్చే నెల ఏప్రిల్‌లో లాంచ్ చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో పాటు అదే 7,300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యూ Z10 మాదిరిగానే వివో T4 కూడా 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఫోన్ 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8జీబీ లేదా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్సన్లను కూడా అందిస్తుందని భావిస్తున్నారు.