OnePlus 13T Launch : వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
OnePlus 13T Launch : కొత్త వన్‌ప్లస్ 13T ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. భారీ బ్యాటరీతో పాటు ఐఫోన్ 16 ఫీచర్లతో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 13T Launch
OnePlus 13T Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R లాంచ్ తర్వాత ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వన్‌ప్లస్ 13T లేదా వన్‌ప్లస్ 13మినీ పేరుతో లాంచ్ చేయనుంది. రాబోయే ఫోన్ ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వన్‌ప్లస్ 13T లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ :
చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (DCS) ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ 6,200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ వేగంగా పవర్-అప్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
హై రిఫ్రెష్ రేటుతో డిస్‌ప్లే :
వన్‌ప్లస్ 13T ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 13 6.82-అంగుళాల డిస్‌ప్లే మాదిరిగా కాకుండా ఈ మోడల్ కొంచెం కాంపాక్ట్‌గా ఉంటుంది. మెరుగైన భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని పుకారు ఉంది.
ఐఫోన్ 16 లుక్-అలైక్ డిజైన్ :
రాబోయే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లుక్ అచ్చం ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుందని అంచనా. డ్యూయల్-కెమెరా సెటప్ వర్టికల్‌గా ఉండొచ్చు. ఆపిల్ రాబోయే ఫ్లాగ్‌షిప్‌కు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆప్టికల్ జూమ్, OISతో పవర్‌ఫుల్ కెమెరా :
ఈ ఫోన్ స్టేబుల్ ఫోటోల కోసం OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. హై క్వాలిటీ క్లోజప్‌ల కోసం 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ షూటర్ కూడా ఉంటుంది.
Read Also : Jio Offers : జియోనా మజాకా.. చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఏకంగా 200 రోజులు.. ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా..!
ఆక్సిజన్ OS ఆపరేటింగ్ సిస్టమ్ :
వన్‌ప్లస్ 13T ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అయ్యే ఆక్సిజన్ OSపై రన్ అవుతుందని భావిస్తున్నారు. ఫీచర్-ప్యాక్డ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వన్‌ప్లస్ 13Tతో పాటు, రాబోయే నెలల్లో వన్‌ప్లస్ Nord 5 కూడా లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ Nord 5 ఫోన్ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. కానీ, మిడ్ రేంజ్ ధరకు ప్రీమియం ఫీచర్లను అందించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.