Vivo T4 Lite
Vivo T4 Lite 5G : వివో ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్ 2025 సందర్భంగా వివో T4 లైట్ 5G ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. వివో T4 లైట్ 5G మోడల్ (Vivo T4 Lite 5G) అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. సరసమైన ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
మీరు ఈ వివో ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లను పొందవచ్చు. 5G కనెక్టివిటీ, భారీ బ్యాటరీతో వివో ఫోన్‌ను కొనాలనుకునే యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
వివో T4 లైట్ 5G ఆఫర్, ధర ఎంతంటే? :
వివో T4 లైట్ 5G ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 28శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత ధర కేవలం రూ. 9,999కు అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు పొందవచ్చు. రూ.9200 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. రూ.3,333 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. వివో T4 లైట్ ఫోన్ ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలలో అందుబాటులో ఉంది.
Read Also : Apple iPhone 16 : విజయ్ సేల్స్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
వివో T4 లైట్ 5G ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
6.74-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 1,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ సాయంతో 2TB వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15లో రన్ అవుతుంది.
కెమెరా, వీడియోల కోసం.. ఈ వివో ఫోన్ డ్యూయల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా కలిగి ఉంది. పవర్ విషయానికొస్తే.. 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు Wi-Fi, GPS, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.