Vivo T4 Pro
Vivo T4 Pro 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెల 26న భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్ తేదీతో పాటు కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్ (Vivo T4 Pro 5G) కూడా వెల్లడించింది. డిస్‌ప్లే, కెమెరా, చిప్‌సెట్, బ్యాటరీ వివరాలతో సహా రాబోయే స్మార్ట్‌ఫోన్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది.
క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉండొచ్చు. ఈ ఫోన్ బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. తద్వారా వివో T4 5G సిరీస్ మోడళ్లలో చేరనుంది. రాబోయే వివో T4 ప్రో 5Gకి సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
వివో T4 ప్రో 5G ధర (అంచనా) :
వివో T4 ప్రో ధర రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండొచ్చు. వివో T3 ప్రో ప్రారంభ ధర రూ. 24,999కు కొనుగోలు చేయొచ్చు.
Read Also : Nothing Phone 3a Pro : కొత్త నథింగ్ ఫోన్ 3a ప్రో ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
వివో T4 ప్రో డిజైన్, స్పెసిఫికేషన్లు :
వివో T4 ప్రో ఫోన్ బ్యాక్ సైడ్ పిల్ షేప్ కెమెరా ఐలాండ్ కలిగి ఉంది. ముఖ్యంగా, ఈ హ్యాండ్‌సెట్ 3x పెరిస్కోప్ జూమ్ కలిగి ఉంది. ‘టెలి లెన్స్’ బ్రాండింగ్ ఉంది. ఇమేజింగ్, పర్ఫార్మెన్స్ కోసం ఈ వివో ఫోన్ ఏఐ ఆధారిత అప్‌గ్రేడ్స్ కలిగి ఉంటుందని వివో వెల్లడించింది.
లీక్‌లను పరిశీలిస్తే.. వివో T4 ప్రో ఆకర్షణీయమైన విజువల్స్, 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. ఈ వివో ఫోన్ 50MP సోనీ IMX882 ప్రైమరీ లెన్స్‌తో సహా కొన్ని ముఖ్యమైన కెమెరా అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది.