Vivo T4 Ultra : వివో ఫోనా మజాకా.. వివో T4 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo T4 Ultra

Vivo T4 Ultra : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేస్తోంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వివో T4 అల్ట్రా (Vivo T4 Ultra) ఫోన్ లాంచ్ కానుంది. ఈ హై-ఎండ్ వేరియంట్‌ ‘అల్ట్రా’ లేబుల్‌తో రానుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో వివో T సిరీస్‌లో వివో T3 అల్ట్రా ఫోన్ రూ. 27,999 అందుబాటులో ఉంది. అయితే, లాంచ్‌కు ముందే వివో T4 అల్ట్రా మోడల్ కీలక స్పెసిఫికేషన్‌లు రివీల్ అయ్యాయి.

Read Also : M2 MacBook Air : ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ M2 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్.. డోంట్ మిస్!

నివేదికల ప్రకారం.. వచ్చే జూన్ ప్రారంభంలో వివో T4 అల్ట్రా మోడల్‌ను లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ ఈ వివో ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ చేశారు. వివో T3 అల్ట్రా మోడల్‌ స్థానంలో రానుంది.

వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో T4 అల్ట్రా ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల pOLED ప్యానెల్‌ను కలిగి ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300 సిరీస్ SoC ద్వారా పవర్ పొందుతుంది. వివో T4 అల్ట్రా కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్‌ను అందించనుంది.

ప్రైమరీ కెమెరా 50MP సోనీ IMX921 సెన్సార్ ఉంటుంది. అయితే, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MPపెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రానుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. వివో T4 అల్ట్రా ఫోన్ 90W ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

వివో T3 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ధర  :
ప్రస్తుత వివో T3 అల్ట్రా (Vivo T4 Ultra) ఫోన్ 6.78-అంగుళాలు, ఫుల్-HD+ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 9200+ SoC ద్వారా పవర్ అందుతుంది. 50MP (OIS) ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 50MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది.

Read Also : Motorola Edge 50 Pro 5G : బిగ్ డిస్కౌంట్.. చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5G ఫోన్.. అద్భుతమైన డీల్ డోంట్ మిస్..!

ఈ ఫోన్‌లో 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. 5,500mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఛార్జింగ్ ఉంటుంది. బేస్ (8GB+128GB) వేరియంట్‌ రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది.

12GB+256GB వేరియంట్ ధర రూ. 31,999 నుంచి లభ్యమవుతుంది. రాబోయే వివో T4 అల్ట్రా ఫోన్ కూడా ఇదే రేంజ్ ఫీచర్లు, ధరలతో ఉండే అవకాశం ఉంది.