M2 MacBook Air : ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ M2 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్.. డోంట్ మిస్!

M2 MacBook Air : మ్యాక్‌ల్యాప్ టాప్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 30వేల తగ్గింపుతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కొనేసుకోవచ్చు.

M2 MacBook Air : ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ M2 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్.. డోంట్ మిస్!

M2 MacBook Air

Updated On : May 26, 2025 / 3:43 PM IST

M2 MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? మీ పాత ల్యాప్‌టాప్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (M2 MacBook Air) ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ రూ. 1,19,900 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు రూ. 70వేల లోపు ధరకు లభ్యమవుతుంది.

Read Also : Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఈ ల్యాప్‌టాప్ అద్భుతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వస్తుంది. ఆపిల్ సిగ్నేచర్ M2 చిప్ కూడా కలిగి ఉంది. రూ. 70వేల లోపు ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ M2 ధర ఎంతంటే? :
మ్యాక్‌బుక్ ఎయిర్ M2 రూ.99,900 ధరకు కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.30,910 తగ్గింపుతో అందుబాటులో ఉంది. HDFC క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.3,500 తగ్గింపు పొందవచ్చు.

పాత ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్‌పై ఈఎంఐ, రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఎంచుకోవచ్చు. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌‌పై ఈ డీల్ పొందవచ్చు.

ఎయిర్ M2 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ 13.6-అంగుళాల రెటినా డిస్‌ప్లే, 60Hz కలిగి ఉంది. హుడ్ కింద ల్యాప్‌టాప్ 8GB ర్యామ్, 512GB వరకు SSDతో ఆపిల్ M2 2వ జనరేషన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్, ఇంటర్నల్ వెబ్ కెమెరా, ఇంటర్నల్ మైక్రోఫోన్‌ల వంటి ఫీచర్లను అందిస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్ Wi-Fi 6 (802.11 a/b/g/n/ac/ax)కు సపోర్టు ఇస్తుంది. రెండు థండర్‌బోల్ట్ 4 (టైప్- C) పోర్ట్‌లు, హెడ్‌ఫోన్, మైక్ కాంబో జాక్‌ను కలిగి ఉంది.

Read Also : iQOO Neo 10 : ఐక్యూ నియో 10 వచ్చేసింది.. కెమెరా ఫీచర్లు కేక.. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

హై క్వాలిటీ స్టీరియో స్పీకర్లు, అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ మిడ్‌నైట్, సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్ గోల్డ్ అనే 4 కలర్ ఆప్షన్లు కలిగి ఉంది.