iQOO Neo 10 : ఐక్యూ నియో 10 వచ్చేసింది.. కెమెరా ఫీచర్లు కేక.. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
iQOO Neo 10 : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.. జూన్ 3 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది..

iQOO Neo 10 launch
iQOO Neo 10 : కొత్త ఐక్యూ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఐక్యూ నియో 10 ఫోన్ లాంచ్ అయింది. దేశంలోనే (iQOO Neo 10)ఫస్ట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో రిలీజ్ అయింది. ఈ ఐక్యూ ఫోన్ నియో 10R లైనప్‌లో అద్భుతమైన డిస్‌ప్లే, డిజైన్, కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
సెగ్మెంట్‌లో అత్యుత్తమ 144Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ కెమెరా సెటప్‌తో 1.5K అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్‌తో భారీ బ్యాటరీని అందిస్తుంది. ఐక్యూ నియో 10 ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
ఐక్యూ నియో 10 స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 10 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ 128GB వేరియంట్‌లో UFS 3.1తో వస్తుంది.
7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. ఈ ఐక్యూ ఫోన్ Wi-Fi 7, NFC, డ్యూయల్ 5G, బ్లూటూత్ 5.4, USB టైప్-C, వాటర్, డస్ట్ నిరోధకతకు IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఐక్యూ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 మెయిన్ సెన్సార్ OISతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ ఈ ఐక్యూ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. బ్యాక్ వీడియో రికార్డింగ్ 60fps వద్ద 4K వరకు సపోర్టు చేస్తుంది. నైట్, పోర్ట్రెయిట్, స్లో మోషన్, పనోరమా అల్ట్రా HD డాక్యుమెంట్ క్యాప్చర్ వంటి అదనపు మోడ్ కూడా ఉన్నాయి.
భారత్‌లో ఐక్యూ నియో 10 ధర ఎంతంటే? :
ఐక్యూ నియో 10 ఫోన్ 8GB, 128GB వేరియంట్ల ధర వరుసగా రూ.31,999, 8GB, 256GB ధర రూ.33,999, 12GB, 256GB వేరియంట్ ధర రూ.35,999, 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్లకు రూ.40,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ఐక్యూ ఫోన్ అమెజాన్, ఐక్యూ ఇ-స్టోర్, రిటైల్ ఛానల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
జూన్ 3 నుంచి ఫస్ట్ సేల్ :
జూన్ 3 నుంచి ఈ ఐక్యూ నియో 10 ఫోన్ మొదటిసారి అమ్మకానికి వస్తుంది. ప్రీ-బుకింగ్ ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ డిస్కౌంట్లతో రూ. 2వేలు, కస్టమర్లు రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా పొందవచ్చు.