Starlink Satellite Internet : గుడ్ న్యూస్.. త్వరలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. భారత్‌లో నెలకు ధర ఎంతంటే?
Starlink Satellite Internet : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం స్పెక్ట్రమ్ ధరలను ట్రాయ్ సిఫార్సు చేసింది. భారత్‌లో ఇంటర్నెట్ ధరలు ఇవేనా?

Starlink Satellite
Starlink Satellite Internet : ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారతీయ మార్కెట్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవలే శాటిలైట్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించి సిఫార్సులను ప్రకటించింది.
ఈ సిఫార్సులపై ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
రూ. 840 కన్నా తక్కువ ధరకే ప్లాన్ :
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రమోషనల్ ధరకు అందించనుంది. నెలకు 10 డాలర్లు (సుమారు రూ. 840) కన్నా తక్కువ ఉండవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాతో అందుబాటులో ఉండనుంది.
దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యను మరింత వేగంగా పెంచడమే లక్ష్యంగా అందించనుంది. తద్వారా రాబోయే కాలంలో కంపెనీ కోటి (10 మిలియన్) కన్నా ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
ప్రభుత్వానికి 4శాతం వాటా :
స్టార్‌లింక్‌తో సహా అన్ని ఆపరేటర్లు తమ వార్షిక ఆదాయంలో 4శాతం ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సి ఉంటుందని ట్రాయ్ సూచించింది. పట్టణ ప్రాంతాల్లో సర్వీసులను అందిస్తే.. ప్రతి కస్టమర్‌కు ప్రతి ఏడాదిలో రూ.500 అదనంగా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అదనపు ఛార్జీ ఉండదు.
గ్రామీణ ఇంటర్నెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ట్రాయ్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధిక స్పెక్ట్రమ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు ఉన్నా శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు దేశంలో తక్కువ ధరకు శాటిలైట్ కనెక్టివిటీ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ ఖరీదు ఎక్కువ :
మరోవైపు.. బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అత్యంత ఖరీదైనది. నెలవారీ ప్లాన్ ధర (6,000 BDT) భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4,200 ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు కోసం వినియోగదారులు కొన్ని డివైజ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర (47,000 BDT) దాదాపు రూ. 33వేలు ఉంటుంది.
Read Also : Samsung Galaxy S23 Plus 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ మీకోసమే..!
వన్ టైమ్ రుసుము కూడా చెల్లించాలి. హ్యాండ్లింగ్, షిప్పింగ్ కోసం 2,800 BDT (సుమారు రూ. 2వేలు) అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసును వినియోగించేందుకు దాదాపు రూ. 37,200 వరకు ఖర్చు అవుతుంది.