Vivo T4 Ultra vs T3 Ultra : వివో ఫోన్లలో ఏది కొంటే బెటర్.. వివో T3 అల్ట్రా కన్నా కొత్త T4 అల్ట్రా బెటరా? మీరే డిసైడ్ చేసుకోండి..!

Vivo T4 Ultra vs T3 Ultra

Vivo T4 Ultra vs T3 Ultra : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? అయితే ఏ మోడల్ కొనాలో అర్థం కావడం లేదా? అయితే మీకోసం లేటెస్ట్ వివో ఫోన్లను అందిస్తున్నాం. భారత మార్కెట్లోకి కొత్త వివో T4 అల్ట్రా ఫోన్ రాగా, ఇప్పటికే వివో T3 అల్ట్రా కూడా అదే రేంజ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. పాత మోడల్ కన్నా కొత్త T4 అల్ట్రాలో మరిన్ని అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. స్పెక్స్, ఫీచర్లు మరింత ఆకట్టకునేలా ఉన్నాయి. గత ఏడాది వివో T3 అల్ట్రా ఫోన్ రూ. 31,999 ప్రారంభ ధరకు వచ్చింది.

Read Also : New Tatkal Ticket Rule : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. IRCTC కొత్త రూల్స్.. తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే అర్జంట్ గా ఈ పని చేయండి..

ఈ అల్ట్రా ఫోన్ కొత్త T4 అల్ట్రా కన్నా తక్కువ ధరకే లభ్యమవుతుంది. కొత్తగా వచ్చిన T4 అల్ట్రా ఫోన్ ధర ఎక్కువగానే ఉంది. మరి ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్ల పరంగా చాలా బాగున్నాయి. ధర కొద్దిగా ఎక్కువ అంతే.. వివో T4 అల్ట్రా, వివో T3 అల్ట్రా ధర, కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే వంటి ఇతర ముఖ్య ఫీచర్లను ఓసారి వివరంగా తెలుసుకుందాం. ఇందులో మీకు ఏ ఫోన్ కావాలో డిసైడ్ చేసుకుని కొనేసుకోవచ్చు.

డిస్‌ప్లే వివరాలివే :
వివో T4 అల్ట్రా ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్, ఐ కేర్ సర్టిఫికేషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మరోవైపు, వివో T3 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్లు :
వివో T4 అల్ట్రా ఫోన్ ప్రాసెసర్ పరంగా ఇమ్మోర్టాలిస్-G720 GPUతో అప్‌గ్రేడ్ అయింది. 4nm-ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC కలిగి ఉంది. వివో T3 అల్ట్రా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో వస్తుంది. వివో T4 అల్ట్రా 12GB LPDDR5 ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. రెండోది 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ వరకు అందిస్తుంది.

కెమెరా ఫీచర్లు :
వివో T4 అల్ట్రాలో పెరిస్కోప్ లెన్స్‌తో వివో T3 అల్ట్రా కన్నా కెమెరా బాగుంటుంది. పాత మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP సోనీ IMX921 OIS ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి.

రెండోది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఉంది. OISతో 50MP సోనీ IMX921 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో T3 అల్ట్రా ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. లేటెస్ట్ వివో T4 అల్ట్రా 4K రిజల్యూషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : Samsung Galaxy S24 : శాంసంగ్ ప్రియులకు బిగ్ డీల్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!

బ్యాటరీ వివరాలివే :
ఈ రెండు వివో ఫోన్లలో 5,500mAh బ్యాటరీ సామర్థ్యం ఒకేలా ఉంటుంది. అయితే, వివో T3 అల్ట్రా 80W ఛార్జింగ్‌తో పోలిస్తే.. వివో T4 అల్ట్రా ఫాస్ట్ 90W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ధర ఎంతంటే? :
వివో T3 అల్ట్రా ధర రూ.27,999తో పోలిస్తే.. వివో T4 అల్ట్రా ధర రూ.37,999కు కొంచెం ఎక్కువ ధర ఉంటుంది. అయితే, వివో T4 అల్ట్రా బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. వివో T3 అల్ట్రా బేస్ వేరియంట్ 8GB + 128GB కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. వివో T3 అల్ట్రా 8GB + 256GB వేరియంట్ ప్రస్తుతం రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది.