Vivo T4R 5G
Vivo T4R 5G : వివో అభిమానుల కోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. వివో T4 సిరీస్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లోకి అతి త్వరలో కొత్త వివో T4R 5G లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచ్ అవుతుందని అంచనా. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ల్యాండింగ్ పేజీని కూడా లైవ్ చేసింది.
రాబోయే వివో T4R ఫోన్ ఇప్పటికే ఉన్న T4x, T4 అల్ట్రా, T4 లైట్ లైనప్‌లో చేరనుంది. భారత మార్కెట్లో అత్యంత సన్నని క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో రానుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు రివీల్ చేయనప్పటికీ, పుకార్లు, లీక్‌లతో ఫోన్ వివరాలు రివీల్ అయ్యాయి. రాబోయే వివో T4R ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో T4R డిజైన్ :
వివో T4R ఫోన్ కేవలం 7.39mm మందంతో ఉంటుందని వివో ప్రకటించింది. లీకైన డిజైన్ ప్రకారం.. త్వరలో లాంచ్ అయ్యే వివో ఫోన్ ఐక్యూ Z10R రీబ్రాండ్ వెర్షన్ అంటున్నారు. అయితే, వివో ఇంకా పూర్తి వివరాలను రివీల్ చేయలేదు.
వివో T4R స్పెసిఫికేషన్లు (అంచనా) :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. వివో T4R ఫోన్ 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రెండింటికి నిరోధకతతో వస్తుంది. 12GB ర్యామ్, డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ద్వారా సపోర్టు ఇస్తుంది. ఇంకా, ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత కస్టమ్ UI అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.
వివో T4R లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో వివో T4R లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే, కచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
వివో T4R ధర (అంచనా) :
వివో T4R ఫోన్ ధర రూ.15వేల నుంచి రూ.20వేల మధ్య ఉంటుందని అంచనా. వివో T4x 5G, వివో T4 5G మధ్య ఉండే అవకాశం ఉంది.