Vivo T4R Launch : అదిరిపోయే ఫీచర్లతో వివో కొత్త T4R ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్, ధర, ఫీచర్ల వివరాలివే..!
Vivo T4R Launch : వివో నుంచి సరికొత్త T4R ఫోన్ లాంచ్ కానుంది. ధర, స్పెషిషికేషన్ల వివరాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

Vivo T4R Launch
Vivo T4R Launch : వివో అభిమానుల కోసం మరో కొత్త వివో ఫోన్ రాబోతుంది. వివో కొత్త T4 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా T సిరీస్‌లో R బ్రాండెడ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ మైక్రోపేజ్ ద్వారా రిలీజ్ చేసింది.
ఈ వివో ఫోన్ క్వాడ్-కర్వ్డ్ ప్యానెల్ కలిగి ఉండొచ్చు. 7.39mm మందం కలిగి ఉండొచ్చు. సెంటర్ పంచ్-హోల్ కెమెరా, వాల్యూమ్ రాకర్‌తో కూడిన సర్కిల్ కెమెరా మాడ్యూల్, కుడి వైపున పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. అధికారిక వివరాలు రివీల్ చేయనప్పటికీ, వివో T4R భారత్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో T4R భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
ఈ నెల లేదా వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్లో వివో T4R లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్, ఇతర రిటైల్ ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది.
వివో T4R స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. వచ్చే 24న భారత మార్కెట్లో ఐక్యూ Z10R లాంచ్ కానుంది. ఈ ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వివో T4R ఫోన్ రాబోతుంది. ఈ వివో ఫోన్ 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, ఆరా లైట్‌ను పొందవచ్చు.
అదనంగా, ఈ వివో ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకతకు IP68, IP69 రేటింగ్ కలిగి ఉంటుందని అంచనా. పర్ఫార్మెన్స్ పరంగా.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్‌సెట్ ద్వారా పవర్ అందుతుంది. వివో T4 స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 కలిగి ఉంటుంది. 12GB ర్యామ్‌తో ఆండ్రాయిడ్ 15-ఆధారిత స్కిన్‌పై రన్ అవుతుంది.
వివో T4R ధర (అంచనా) :
వివో T4R ఫోన్ ధర దాదాపు రూ.20వేలు ఉంటుందని అంచనా. ఈ బ్రాండ్ ఇంకా ధర ఎంత అనేది రివీల్ చేయలేదు.