Vivo T4R Sale : వివోనా మజాకా.. అతి చౌకైన ధరకే కొత్త వివో T4R ఫోన్.. ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Vivo T4R Sale : కొత్త వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సేల్ మొదలైంది. ధర కూడా చాలా తక్కువే.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T4R price in India

Vivo T4R Sale : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో ఇటీవలే వివో T4 సిరీస్ లాంచ్ అయింది. కేవలం 5 రోజుల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ కేటగిరీలో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వివో ఫోన్ (Vivo T4R price in India) మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వివో ఫోన్ చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివో T4R భారత్ ధర :
వివో T4R ఫోన్ 3 వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,499కు పొందవచ్చు. హై స్టోరేజ్ కోసం 8GB + 256GB ఆప్షన్ రూ. 21,499కు లభిస్తుంది. 12GB + 256GB వేరియంట్ కూడా ఉంది. వివో T4R ఫోన్ ధర రూ. 23,499కు పొందవచ్చు.

Read Also : Motorola Edge 50 Pro : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేసుకోండి.. డోంట్ మిస్!

ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ అనే 2 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో రానుంది. ఆగస్టు 5 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ లేదా Axis బ్యాంక్ కార్డులతో రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా వివో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. అంతేకాదు.. రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు.

వివో T4R స్పెసిఫికేషన్లు  :
వివో T4R ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 5G ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌‌టచ్OS 15పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 50MP మెయిన్ కెమెరా, 2MP బోకె సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,700mAh బ్యాటరీ కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ నానో సిమ్ స్లాట్లు, బ్లూటూత్ 5.4, Wi-Fi 6 వంటి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి. వివో T4R ఫోన్ 183.5 గ్రాములు బరువు ఉంటుంది.