Vivo V30 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో V30 ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇప్పుడే కొనేసుకోండి!

Vivo V30 5G : వివో V30 5G ఫోన్ భలే ఉందిగా.. 12GB ర్యామ్, కెమెరా ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.

Vivo V30 5G

Vivo V30 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V30 5G అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో (Vivo V30 5G) ఉంది. ఈ ప్రీమియం ఫోన్ డిజైన్ చాలా బాగుంది. గ్లాస్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

వివో 12GB RAM, 50MP కెమెరాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వివో V30 ఫోన్ ఎలా కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Lava Shark 5G : లావా షార్క్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ బడ్జెట్ ఫోన్ అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్..!

డిస్‌ప్లే :
డిస్‌ప్లే విషయానికి వస్తే.. 2800×1260 రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్, వీడియో స్క్రోలింగ్‌ కలిగి ఉంది. 2800 నిట్స్ బ్రైట్‌నెస్ సూర్యకాంతిలో కూడా స్పష్టంగా డిస్‌ప్లే కనిపిస్తుంది.

పర్ఫార్మెన్స్ :
వివో V30లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. గేమింగ్‌కు సరైనది. 8GB, 12GB ర్యామ్, 128GB, 256GB వరకు స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. ఎక్కువ డేటాను స్టోర్ చేయగలదు. వివో ఫోన్‌లో ఫన్‌టచ్ OS14 ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కస్టమైజడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కెమెరా :
కెమెరా ప్రియులైతే.. ఈ (Vivo V30 5G) ఫోన్ మీకోసమే. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా OISతో వస్తుంది. 50MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ ప్రియులకు ఫ్రంట్ సైడ్ 50MP ఆటోఫోకస్ కెమెరా ఉంది.

ఆరా లైట్‌తో నైట్ పోర్ట్రెయిట్‌లు కూడా అద్భుతంగా వస్తాయి. హై రిజల్యూషన్, లైవ్ ఫోటో, పోర్ట్రెయిట్, నైట్, సూపర్‌మూన్, ఆస్ట్రో మోడ్, డ్యూయల్ వ్యూ వంటి ఫొటోలు, వీడియోలకు అనేక సీన్ మోడ్స్ ఉన్నాయి.

బ్యాటరీ :
బ్యాటరీ విషయానికి వస్తే.. వివో V30 పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుంది. మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
5G + 5G డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై సపోర్ట్ ఉంది. Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, OTG వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. FM, NFC సపోర్ట్ లేదు. వివో ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు, మందం 0.74 సెం.మీ. ఉంటుంది.

ఛార్జర్ టైప్-సి కేబుల్, బ్యాక్ కవర్, స్క్రీన్ ప్రొటెక్టర్, సిమ్ ఎజెక్టర్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటాయి. ఈ వివో ఫోన్ అండమాన్ బ్లూ, పీకాక్ గ్రీన్ క్లాసిక్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే? :
వివో V30 (Vivo V30 5G) అసలు ధర రూ. 42,999 ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే 20శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కేవలం రూ.33,990కి కొనుగోలు చేయొచ్చు. పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Cheapest Prepaid Plans : జియో, ఎయిర్‌టెల్, Vi చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ కావాలో ఎంచుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

వివో V30 స్టైలిష్ స్మార్ట్‌ఫోన్. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం లుక్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.