Vivo V50 5G Price : వివో కొత్త 5జీ ఫోన్ కావాలా? కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ క్రేజీ ఆఫర్ మీకోసమే.. అడ్వాన్స్ కెమెరాలతో ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 7 వేలు తగ్గింపుతో రూ. 32,999కు లభ్యమవుతుంది.
2/6
ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్, భారీ 6,000mAh బ్యాటరీ, స్లిమ్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC వంటి ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా 5శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్‌గా వివో v50 5జీ ధర రూ. 28,999కే సొంతం చేసుకోవచ్చు.
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 5జీ డీల్ : వివో V50 5జీ ఫోన్ ప్రారంభ లాంచ్ ధర రూ.39,999 ఉండగా రూ.7వేలు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు అదనంగా రూ.4వేల వరకు 5శాతం తగ్గింపు అందిస్తోంది.
4/6
ఈ-కామర్స్ దిగ్గజం రూ.11వేల నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అంటే.. మొత్తంగా రూ. 26,650 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫైనల్ డిస్కౌంట్ మీ పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
5/6
వివో V50 5జీ స్పెసిఫికేషన్లు : వివో V50 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. నేరుగా సన్ లైట్ పడినా 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR4X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది.
6/6
బ్యాటరీ విషయానికి వస్తే.. వివో V50 ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇమేజింగ్ కోసం (Zeiss) సపోర్టుతో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP సెకండరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫోన్ 50MP కెమెరా కూడా ఉంది.