Vivo V60 5G : ఆఫర్ అదిరింది మావా.. ఈ వివో 5G ఫోన్ చాలా చీప్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo V60 5G : వివో కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి60 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- April 14, 2026 / 11:08 AM IST
Vivo V60 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి60 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. మిడ్-రేంజ్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్. బ్యాంకుల డిస్కౌంట్లతో ఈ వివో ఫోన్ ధర ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
వివో ఫోన్‌తో పాటు ఐక్యూ నియో సిరీస్ ఫోన్లు, వన్‌ప్లస్ నార్డ్ రేంజ్, శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్, రెడ్‌మి నోట్ రేంజ్ వంటి అనేక ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో కొనేసుకోవచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60 5జీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60 ధర ఎంతంటే? : భారత మార్కెట్లో వివో V60 అసలు ధర రూ. 36,999గా ఉంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 3,010 డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ. 33,989కి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా రూ. 1,700 ఆదా చేసుకోవచ్చు. మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. 24 నెలల పాటు నెలకు కేవలం రూ. 1,665 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
వివో V60 కొనాలా? వద్దా? : వివో కొనాలని చూస్తుంటే.. వివో V60 5G ఫోన్ భారీ 6.77-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 5,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 4nm డిజైన్‌పై స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ధరకు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్‌లో 6,500mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్‌ఓఎస్ 15తో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో V60 5జీలో జైస్ సపోర్టుతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP కెమెరా కూడా ఉంది.
