Vivo V70 Price Drop : రూ.59,999 ఫోన్ ఇప్పుడు రూ.55,999కే.. వివో V70పై అదిరే డీల్
Vivo V70 Price Drop : వివో V70పై విజయ్ సేల్స్‌లో భారీ ధర తగ్గింపు లభిస్తోంది. రూ.55,999 ధరతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.10వేల వరకు అదనపు డిస్కౌంట్, స్పెసిఫికేషన్లు, కెమెరా వివరాలివే..
- Sreehari A
- Updated on- October 3, 2026 / 11:50 AM IST
Vivo V70 Price drop
- విజయ్ సేల్స్‌లో రూ. 4వేలు తగ్గింపు తర్వాత వివో వి70 రూ. 55,999కే
- బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరో రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు
- 120Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 6,500mAh బ్యాటరీ, 3 రియర్ కెమెరాలు
Vivo V70 Price Drop : కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీతో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. కొనుగోలుదారులు వివో V70పై అద్భుతమైన డీల్ అందిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్ రూ.55,999 ధరకు లభిస్తోంది.
కంపెనీ నిర్ణయించిన ప్రస్తుత ధర రూ.59,999తో పోలిస్తే రూ.4వేలు తక్కువకే లభిస్తోంది. అంతేకాకుండా అర్హత ఉన్న HSBC, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. 24 నెలల కాలవ్యవధికి నెలకు రూ.2,468 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతున్నాయి. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వారికి డివైస్ మోడల్, కండిషన్ వంటి అంశాల ఆధారంగా అదనపు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. :
వివో వి70లో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 5,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని వివో పేర్కొంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్‌లో 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ లభిస్తుంది.
Read Also : UMANG App PF Services : PF ఉన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్క యాప్‌తో ఇంటి నుంచే అన్ని పనులు!
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. 6,500mAh బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది.
ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ద్వారా కొనుగోలుదారులు ఫైనల్ ధరను చెక్ చేసుకోవడం బెటర్. ఆఫర్లు, స్టాక్, రూల్స్ మారే అవకాశం ఉంది. కొనుగోలు సమయంలో అన్ని చెక్ చేసుకుని కొనుగోలు చేయడం బెటర్.
