Vivo V80 Lite : Vivo నుంచి బ్యాటరీ బీస్ట్! 10,000mAh, 50MP డ్యూయల్ కెమెరా.. లాంచ్ డేట్ ఫిక్స్!

Vivo V80 Lite : వివో V80 లైట్ 5G ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్‌తో పాటు ఒక సెకండరీ కెమెరా కూడా ఉంటుందని అంచనా.

Vivo V80 Lite

  • ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్
  • ఆస్ఫెరిక్ లెన్స్‌, గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది
  • వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానుంది

Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V80 లైట్ 5G లాంచ్ ఖరారైనట్లు సమాచారం. ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

వివో V80 లైట్ అతిపెద్ద బ్యాటరీతో వస్తోంది. గతంలో, కంపెనీ 10,200mAh బ్యాటరీతో వివో V600 ప్రోను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ దేశీయ మార్కెట్ మినహా మరే ఇతర మార్కెట్లోనూ లాంచ్ కాలేదు. వివో V80 లైట్ 5Gలోని ఇతర ఫీచర్లతో పాటు ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సెప్టెంబర్ 3న అధికారిక లాంచ్ :

వచ్చే నెలలో వివో V80 లైట్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 3న అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా పోస్ట్ చేసింది.

ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ గ్రీన్, రోజ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాక్ కెమెరా కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్‌ను మలేషియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ ముందుగానే ప్లాన్ చేస్తోంది.

Read Also : Motorola G37 Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా G37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

50MP డ్యూయల్ కెమెరా సెటప్ :
వివో V80 లైట్ 5G ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. దాంతో పాటు అల్ట్రావైడ్ సెన్సార్ సెకండరీ కెమెరా కూడా ఉంది. 8MP కెమెరా కావచ్చు. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. థర్డ్ కెమెరా రింగ్ క్లియర్ కనిపించడం లేదు. వివో ఈ ఫోన్‌లో ఆస్ఫెరిక్ లెన్స్‌ వాడింది.

ఆస్ఫెరిక్ లెన్స్‌లు అంటే.. సర్పేస్ కర్వడ్ పూర్తిగా సర్కిల్ షేప్ కాకుండా ఎడ్జ్ ల నుంచి సెంటర్ వరకు బెండ్ లెన్స్‌లు ఉంటాయి. దాంతో లెన్స్ ఒకే చోట ఎక్కువ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫోకస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వివో ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫొటోగ్రఫీ కెమెరాను అందించనుంది.

వివో ఫస్ట్ ఫోన్ ఇదే :
ఈ ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ అతిపెద్ద ఆకర్షణగా కంపెనీ చెబుతోంది. ఆల్వేస్ పవర్డ్ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేసింది. భారీ బ్యాటరీతో చైనా వెలుపల లాంచ్ కానున్న వివో ఫస్ట్ ఫోన్ ఇదే కానుంది. ఈ ఫోన్ పోస్టర్‌లో పవర్ బటన్ వాల్యూమ్ బటన్లు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి.

కర్వ్ డిజైన్, ఎడ్జ్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ కాలేదు. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో ఈ ఫోన్ 6GB ర్యామ్‌తో కనిపించింది. అయితే, లాంచ్ సమయంలో 8GB వరకు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లతో రావచ్చు.