Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం 200MP కెమెరాతో వివో X ఫోల్డ్ 6 వచ్చేస్తోంది.. శాంసంగ్, హానర్ ఫోన్లకు దబిడి దిబిడే..

Vivo X Fold 6 : వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ N6, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, హానర్ మ్యాజిక్ వి6 ఫోన్లతో పోటీపడనుంది.

Vivo X Fold 6

  • ఈ నెలలో వివో ఎక్స్ ఫోల్డ్ 6 లాంచ్ కావచ్చు
  • ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ ఉండొచ్చు
  • వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్థానంలో వివో ఎక్స్ ఫోల్డ్ 6 రాబోతుంది

Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. అతి త్వరలో వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. కొన్ని లీక్‌లను పరిశీలిస్తే.. వివో X ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. గత ఏడాది జూలైలో భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్థానంలో ఈ కొత్త ఫోన్ వస్తోంది.

చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ ఈ నెలలో (Vivo X Fold 6) లాంచ్ కావచ్చని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రిపోర్టు తెలిపింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో హైకేపాసిటీ బ్యాటరీలు ఉండవు.

గత కొన్నేళ్లుగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో వేగంగా డెవలప్ అవుతోంది. ఈ మార్కెట్‌లో సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ అతిపెద్ద వాటా ఉంది. అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ ఫొల్డబుల్ ఐఫోన్ కూడా ఈ ఏడాదిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : EPFO Update : మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి!

200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా :
వివో ఎక్స్ ఫోల్డ్ 6 రియర్ కెమెరా యూనిట్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. సేఫ్టీ కోసం బ్యాక్ సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందించే అవకాశం ఉంది.

ఇటీవలే వివో ఎక్స్ ఫోల్డ్ 6 IMEI డేటాబేస్‌లో లిస్టు అయింది. త్వరలో లాంచ్ కానుందని అంచనా. వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒప్పో ఫైండ్ N6, రాబోయే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, హానర్ మ్యాజిక్ V6 ఫోన్లతో పోటీపడుతుంది.

గత ఏడాది లాంచ్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 8.03-అంగుళాల అమోల్డ్ ప్రైమరీ డిస్‌ప్లే (2,480×2,200 పిక్సెల్స్) అందిస్తుంది. 6.53-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, అడ్రినో 750 జీపీయూతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది.