Vivo X200 FE
Vivo X200 FE : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో X200 FE స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జూలై 14న భారత మార్కెట్లో వివో X ఫోల్డ్ 5తో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
హై పర్ఫార్మెన్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. వివో X200 FE ధర దాదాపు రూ. 55వేలు ఉంటుందని సమాచారం.
ఈ వివో ప్రీమియం అమోల్డ్ డిస్‌ప్లే, జీస్‌తో కలిసి డెవలప్ అయిన అడ్వన్స్ కెమెరా టెక్నాలజీ, టాప్-టైర్ డ్యూరబిలిటీ రేటింగ్ అందిస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యూజర్లే లక్ష్యంగా ఈ ఫోన్ జూలై 14 నుంచి జూలై19 మధ్య భారత మార్కెట్లోకి రానుందని నివేదికలు సూచిస్తున్నాయి.
వివో X200 FE ఫోన్ 6.31-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్ (2640 x 1216 పిక్సెల్‌లు), 120Hz రిఫ్రెష్ రేట్‌తో, ఫ్లూయిడ్ విజువల్స్, పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది.
460PPI పిక్సెల్ సాంద్రతతో స్క్రీన్ గేమర్‌లు, స్ట్రీమర్‌లకు ఇమ్మర్సివ్ వ్యూను అందిస్తుంది. వివో X200 FE మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది. అదనంగా, ఫోన్ మల్టీ టాస్కింగ్ కోసం 12GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్టు ఇస్తుంది.
రియర్ కెమెరా సెటప్ ఫీచర్లు :
జైస్ ఆప్టిక్స్ తో ఏఐ పవర్డ్ ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో 50MP వైడ్-యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇమేజ్ క్లారిటీ, డైనమిక్ రేంజ్, లో లైటింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వివో అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది.
కేవలం 186 గ్రాముల బరువు, 7.99mm మందం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ కలిగి ఉంది. మోడరన్ బ్లూ, లేత తేనె పసుపు, ఫ్యాషన్ పింక్ మినిమలిస్ట్ బ్లాక్ అనే నాలుగు స్టైలిష్ కలర్ ఆషన్లతో వస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ :
వివో X200 FE ఫోన్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. 90W అల్ట్రా-ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. తక్కువ డౌన్‌టైమ్‌తో ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చు.
అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, eSIM సపోర్ట్‌తో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, USB టైప్-C, NFC కూడా ఉన్నాయి. IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.