స్మార్ట్‌ఫోన్ అంటే ఇలా ఉండాలి… వివో నుంచి వస్తున్న కొత్త ఫోన్‌ ఫీచర్లు ఏం ఉన్నాయ్‌ భయ్యా…

చాలా మంది ఎదురుచూస్తున్న Vivo X200 FEను భారత్‌లో త్వరలోనే ఆ కంపెనీ విడుదల చేయనుంది.

వివో స్మార్ట్‌ఫోన్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌. వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే విడుదల కానుంది. చాలా మంది ఎదురుచూస్తున్న Vivo X200 FEను భారత్‌లో త్వరలోనే ఆ కంపెనీ విడుదల చేయనుంది. 2024 అక్టోబర్‌లో చైనాలో Vivo X200, Vivo X200 Proను అధికారికంగా లాంచ్‌ చేశారు.

అనంతరం 2024 డిసెంబర్ 12న భారత్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో Vivo X200 FEను భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు.

Also Read: రూ.25 వేలలోపే OnePlus Nord CE 5? ఫీచర్లు అదుర్స్.. కొనేస్తారా?

ఫీచర్లు
Vivo X200 FE స్మార్ట్‌ఫోన్‌ Dimensity 9400e చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో రానుంది. ఫొటోగ్రఫీ కోసం Vivo X200 FE బ్యాక్‌ సైడ్ 50MP ప్రధాన సెన్సార్, 50MP టెలిఫొటో లెన్స్‌తో రానుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వచ్చే ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో వచ్చే అవకాశం ఉంది. Vivo X200 FE ఈ ఏడాదిలో జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో భారత్‌లో విడుదల కావచ్చు.

Vivo X200 FE ధర
ధర విషయానికొస్తే.. Vivo X200 FE భారత్‌లో దాదాపు రూ.55,999గా ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రారంభ ధర రూ.65,999తో Vivo X200 సిరీస్‌ను విడుదల చేశారు. దాని కంటే Vivo X200 FE ధర చాలా తక్కువ.