రూ.25 వేలలోపే OnePlus Nord CE 5? ఫీచర్లు అదుర్స్.. కొనేస్తారా?

ఏకంగా 7,100 mAh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని తెలుస్తోంది.

రూ.25 వేలలోపే OnePlus Nord CE 5? ఫీచర్లు అదుర్స్.. కొనేస్తారా?

Updated On : May 2, 2025 / 6:06 PM IST

భారత మార్కెట్లో వన్‌ప్లస్ జోరు కొనసాగుతోంది. OnePlus Nord CE 5 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల కానుందని గట్టి సంకేతాలు వస్తున్నాయి. తాజాగా, ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ పొందడమే ఇందుకు కారణం.

గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన Nord CE4కు కొనసాగింపుగా వస్తున్న ఈ మోడల్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. 91Mobiles వంటి ప్రముఖ వెబ్ సైట్ ల నివేదికలు, అలాగే ఇతర లీకుల ద్వారా OnePlus Nord CE 5 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు మీకోసం..

డిస్‌ప్లే ఎలా ఉండొచ్చు?
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల పెద్ద Full HD+ OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. గేమింగ్, స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు 120Hz రిఫ్రెష్ రేట్, మెరుగైన బ్రైట్‌నెస్‌తో వస్తుందని అంటున్నారు.

పనితీరు, బ్యాటరీ
శక్తిమంతమైన MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రావచ్చని అంచనా. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండొచ్చు. ఏకంగా 7,100 mAh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని తెలుస్తోంది. దీనికి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది Android 15 ఆధారిత OxygenOS తో పనిచేసే అవకాశం ఉంది.

కెమెరా సెటప్ ఎలా ఉండనుంది?
బ్యాక్‌ సైడ్ 50MP ప్రధాన కెమెరా (ఇది Sony LYT600 లేదా IMX882 సెన్సార్ కావచ్చు) దానికి తోడుగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది. 16MP ఫ్రంట్ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రావచ్చని సమాచారం.

డిజైన్, కలర్స్
లీకైన చిత్రాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మధ్యలో పంచ్-హోల్ డిజైన్, చాలా పలుచని బెజెల్స్ (bezels) ఉండొచ్చు. లైట్ పింక్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో కూడా ఈ ఫోన్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుత నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ ధర సుమారు రూ.24,999 ఉండే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం లీకుల ఆధారంగా చెబుతున్న ధర మాత్రమే. అధికారిక ప్రకటన వెలువడే వరకు కచ్చితమైన ధర, అలాగే పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సిందే.